ప్రముఖ హిరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఆమె (మే 4, సోమవారం) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

ఆదివారం రాత్రి తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన త్రిష.. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా, సామాన్య భక్తురాలిలా ఆమె శాంతియుతంగా పూజలు నిర్వహించారు.
తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజే త్రిష తిరుమలకు వెళ్లడంతో.. ఆమె విజయ్ పార్టీ విజయం కోసమే ఈ మొక్కులు చెల్లించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో.. ఆయన సన్నిహితురాలైన త్రిష పర్యటనపై అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు.


