టీవీకేతో కాంగ్రెస్‌ పొత్తు.. డీఎంకే షాకింగ్‌ రియాక్షన్‌ | Dmk Slams Congress For Joining Hands With Tvk | Sakshi
Sakshi News home page

టీవీకేతో కాంగ్రెస్‌ పొత్తు.. డీఎంకే షాకింగ్‌ రియాక్షన్‌

May 6 2026 8:27 PM | Updated on May 6 2026 8:29 PM

Dmk Slams Congress For Joining Hands With Tvk

చెన్నై: భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదంటూ డీఎంకే తేల్చి చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందన్న డీఎంకే.. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిచాం. అందుకు తాము భారీ మూల్యాన్ని చెల్లించామంటూ డీఎంకే పేర్కొంది.

సోనియా, మన్మోహన్‌ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం. రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం. అయితే ఇప్పుడు డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం.. మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం. మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది. ఇది ప్రజలను మోసం చేయడమే. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదు. 

రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా స్టాలిన్‌ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండి కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్‌ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం. ఓటమి మాకు కొత్తేమి కాదు.. వెన్నుపోటు కొత్త కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతాం’’ అంటూ డీఎంకే హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement