పుదుచ్చేరి : బోణీ కొట్టిన పార్టీ, సీఎం రంగస్వామి గెలుపు | Puducherry Election Result 2026 Live Updates: CM Rangaswamy Marks Win | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి : బోణీ కొట్టిన పార్టీ, సీఎం రంగస్వామి గెలుపు

May 4 2026 12:40 PM | Updated on May 4 2026 2:33 PM

Puducherry Election Result 2026 Live Updates: CM Rangaswamy Marks Win

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (Puducherry)అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 22 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 06, ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు.

సీఎం ఎన్‌ రంగస్వామి (N Ranga Swamy) విజయంతో పార్టీ బోణీ కొట్టింది. తట్టంచావడి నియోజకవర్గం నుంచి  సీఎం ఎన్.రంగస్వామి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, నేయం మక్కల్ కజగం అభ్యర్థి వినాయగం (Vinayagam)పై ఆయన స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. మరో వైపు మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తద్వారా ఐదోసారి సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు   మార్గం సుగమమైనట్టే కనిపిస్తోంది.

కాగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీజేపీ కూటమి ఏకంగా 22 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితమైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement