తమిళనాడులో ఎవరెన్ని ఓట్లు సాధించారంటే..! | Vote Share of Major Parties in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఎవరెన్ని ఓట్లు సాధించారంటే..!

May 4 2026 4:53 PM | Updated on May 4 2026 5:00 PM

Vote Share of Major Parties in Tamil Nadu

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల నడుమ విజయ్‌ టీవీకే పార్టీ  ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందా.. లేదా అనే దానిపై విపరీతమైన ఆసక్తి చోటు చేసుకుంది.  ప్రధానంగా టీవీకే ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ వందకుపైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 118 సీట్లు అవసరం. ఉదయం నుంచి 100 నుంచి 107  స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కొనసాగుతోంది. 

అదే సమయంలో విజయ్‌ పార్టీ చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 చోట్ల 500 ఓట్ల మెజార్టీతో, 12 స్థానాల్లో రెండు వేల మెజార్టీతో విజయ్‌ పార్టీ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విజయ్‌ వంద సీట్ల మార్క్‌కు ఏమీ ఢోకా ఉండదు.. కానీ ప్రభుత్వాన్ని  సింగిల్‌గా ఏ‍ర్పాటు  చేయడం మాత్రం కష్టమవడం ఖాయం.   కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చినా అది ఎంతవరకూ సరిపోతుంది అనే  దానిపై చర్చ నడుస్తోంది. దాంతో మరొక పెద్ద పార్టీతో టీవీకేకు పొత్తు అనివార్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. 

ఇదిలా ఉంచితే, తమిళనాడులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై  ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్ని బట్టి.. విజయ్‌ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు. దాంతో  విజయ్‌ పార్టీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో కొనసాగడానికి కారణమైంది. ఇక స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా విజయ్‌ పార్టీకి చాలా దగ్గరగానే వచ్చింది. డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు, కాగా డీఎంకే ఒంటరిగా సాధించిన ఓట్లు 83 లక్షలు. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు, కాగా ఒంటరిగా ఆ  పార్టీ 77 లక్షలు సాధించింది. 

పుంజుకున్న డీఎంకే..!
కౌంటింగ్‌ ఆరంభమైనప్పటినుంచీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ మూడో స్థానంలో కొనసాగిన డీఎంకే.. అటు తర్వాత మెల్లగా పుంజుకుంది. తొలుత  50 సీట్లనైనా డీఎంకే గెలుస్తుందా అనే దిశ నుంచి 77 సీట్ల ఆధిక్యంలోకి డీఎంకే వచ్చింది. అంటే డీఎంకే బాగా పుంజుకుని విజయ్‌ పార్టీ ఊపుకు కాస్త అడ్డుకట్ట వేసింది.  ప్రస్తుతం ఇంకా కొంటింగ్‌ జరుగుతున్న క్రమంలో డీఎంకే మరిన్ని సీట్లను గెలుచుకుని విజయ్‌ ఆధిక్యాన్ని తగ్గించవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 సుమారుగా డీఎంకే ఓట్ల షేర్‌ అంతా కూడా టీవీకే షిప్ట్‌ అవడమే విజయ్‌ అనూహ్య ఫలితాలకు కారణమైంది.   విజయ్‌ టీవీకే పార్టీకి ఏకధాటి ఊపు ఇవ్వకుండా డీఎంకే ఎంతో కొంత మెరుగైన ఫలితాల దిశగానే ముందుకెళుతుందనే చెప్పాలి.  విజయ్‌ పార్టీ ఒక సీటు ఆధిక్యం తగ్గుతుంటే అదే సమయంలో డీఎంకే ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. ఇది కాస్త సస్పెన్స్‌ను కూడా క్రియేట్‌ చేస్తోంది. సీఎం స్టాలిన్‌ కొళత్తూర్‌ నుంచి ఓడి పోవడం ఆ పార్టీకి కాస్త ఎదురుదెబ్బ మినహా పుంజుకున్న తీరు.. టీవీకే  ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేయడాన్ని క్లిష్టం చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement