సినీ స్టార్ విజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. వీసీకే చీఫ్ తిరుమావళన్ డీఎంకేను వీడేది లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో టీవీకే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు అక్కడి చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"మేము టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదు. మేము ఇప్పటికీ డీఎంకేతోనే ఉన్నాము. మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మేము ఈ పొత్తుతో ముందుకెళ్లాము. టీవీకే నుండి ఎలాంటి ఆహ్వానాన్ని ఆశించడం లేదు. తమిళనాడులో సంఘ్ పరివార్ నేతృత్వంలోని మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుకు మేము చాలా కృతజ్ఞులం." అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ రెండు స్థానాలు గెలిచింది.
ఇది వరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు తగినంత సంఖ్యాబలం ఉందని రెండు వారాల గడువు ఇవ్వాలని తమిళనాడు గవర్నర్‌ని విజయ్ కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
#WATCH | Chennai | Viduthalai Chiruthaigal Katchi (VCK) Chief, Thol. Thirumavalavan, "We are not thinking about a coalition govt along with TVK. We are still with DMK. We are for secularism. We will proceed with this alliance for the welfare of the people of Tamil Nadu. We are… pic.twitter.com/WXpUBTWYPH
— ANI (@ANI) May 5, 2026


