స్టాలిన్‌ లేటెస్ట్‌ రోడ్‌ షో.. | MK Stalin holds a roadshow at the Kolathur Assembly constituency | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌ లేటెస్ట్‌ రోడ్‌ షో..

May 5 2026 9:27 PM | Updated on May 5 2026 9:36 PM

MK Stalin holds a roadshow at the Kolathur Assembly constituency

అది ఎన్నికల ప్రచారం కాదు..  విజయోత్సవ ర్యాలీ అంతకన్నా కాదు.  తాను ప్రజల మనిషినే అని చెప్పుకునే ఎంకే స్టాలిన్‌ ర్యాలీ అది. ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాట  ఎన్నికల్లో అటు అభ్యర్థిగానూ, ఇటు పార్టీని విజయపథంలో నడిపించడంలోనూ విఫలమయ్యారు స్టాలిన్‌. టీవీకే విజయ్‌ దెబ్బతో  డీఎంకే, అన్నాడీఎంకేలు  ఘోరంగా చతికిలబడ్డాయి. 

ఇది స్టాలిన్‌  కలలో కూడా ఊహించి ఉండరు. కచ్చితంగా గెలుస్తామని, అటు సర్వేలు కూడా డీఎంకేకు పట్టం కట్టిన వైనం.  అయితే ‘ఛేంజ్‌’ చేసేశారు ప్రజలు. తమ ఓటుతో విజయ్‌కు జైకొట్టారు. 

ఇదిలా ఉంచితే,. ఎవరైనా ఓడిపోతే పూర్తిగా చతికిలబడిపోయి కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం ఆవుతారు. కానీ స్టాలిన్‌ అలా చేయలేదు. ఓడిపోయిన రెండో రోజే రోడ్‌ షో పేరుతో ప్రజల ముందుకు వచ్చారు స్టాలిన్‌. తనను ఓడించిన కొళత్తూరు ప్రజల ముందుకే వచ్చి.. అభివాదం చేశారు. ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) స్టాలిన్‌ తాను పరాజయం పాలైన కొళత్తూరులో పర్యటించారు. 

తాను ఓడిపోయిన చాయలు ముఖంలో కనిపిస్తున్నప్పటికీ స్టాలిన్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను ఓడించిన ప్రజలను కలవాలని ఇలా రోడ్‌ షోలో పాల్గొన్నారా.. లేక తనకు ఓట్లు వేసిన జనానికి ఒకసారి రోడ్‌ షో రూపంలో థాంక్స్‌ చెబుదామనుకున్నారో కానీ ‘మీతోనే ఉంటానని, మీ వాడిగానే ఉంటాననేది’  ఆయన ముఖంలో మాత్రం కనిపించింది. 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement