దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాలన్నే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క తమిళనాడు తప్ప అక్కడ మాత్రం ఎవరు ఉహించని విధంగా సినీ స్టార్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించి లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాగా ఈ ఫలితాల అంచనాను ముందే ఓ ఏజెన్సీ ఊహించింది. అయితే దాని అంచనా చూసి తొలుత అందరూ నవ్వుకున్నారని ఆ సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా జాతీయ మీడియాతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. బెంగాల్, అస్సాంలలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేస్తుండగా కేరళలో విజయకేతనం ఎగురవేస్తుండగా యూడీఎఫ్ విజయదుదుంబి మోగించింది. అయితే్ ఈ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఫలితాలు మాత్రం తమిళనాడువే.. డీఎంకే, ఏఐడీఎంకే లాంటి సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలను వెనక్కి నెట్టి ఫిలిం స్టార్ విజయ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే ఈ విజయాన్ని తొలుతగా అంచనా వేసింది మాత్రం ఆక్సిస్ ఇండియా మాత్రమే అయితే ఆ సమయంలో ఆసర్వేలను చూసి దేశమంతా నవ్వుకుందని ఆ సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా అన్నారు.
ప్రదీప్ గుప్తా వ్యాఖ్యలు
డేటా సైన్స్ విజయం: "ఇది డేటా సైన్స్ సాధించిన విజయం. మిగతా సంస్థలు గ్రౌండ్ లెవల్‌లో ప్రజల నాడిని ఎందుకు పట్టుకోలేకపోయాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసాం కానీ దీనిని ఎవరూ నమ్మలేదుఇదంతా ఒక గాలి వార్త అని కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషకులు, ఇతర సంస్థలు మమ్మల్ని చూసి నవ్వుకున్నాయి అన్నారు.
విజయ్ టీవీకే పార్టీకి టీవీకేకు తాము చెప్పినట్టే 35 శాతం ఓట్లు లభిస్తున్నాయని డీఎంకేకు మాత్రం 35 శాతం ఓట్లు వస్తాయని తాము అంచనా వేయగా, ప్రస్తుతం 32 శాతంగా ఉందన్నారు. ఏఐఏడీఎంకే (AIADMK) కి 23 శాతం వస్తాయని చెబితే, ప్రస్తుతం 27 శాతంగా ఉందని చెప్పారు. అదే స్థానాల ప్రకారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రెండో స్థానంలో, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టీవీకే విజయానికి కారణాలు
ప్రదీప్ గుప్తా విశ్లేషణ ..తమిళనాట 18 నుండి 39 ఏళ్ల మధ్య వయస్సు గల అధికంగా 42 శాతం మంది ఉన్నారని వీరంతా విజయ్ వైపు మెుగ్గు చూపారని తెలిపారు. 40 ఏళ్ల పైబడిన వారిలో 25 నుండి 30 శాతం మంది విజయ్‌కు మద్దతు ఇచ్చారు. అదే విధంగా డీఎంకే తరువాత అధికంగా మహిళా ఓటర్లు టీవీకేకే ఓటు వేసినట్లు తాము గుర్తించామని తెలిపారు. కాగా ప్రస్తుతం తమిళనాడులో టీవీకే 40 స్థానాల్లో గెలువగా మరో 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.


