తాడేపల్లి: తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీవీకే చీఫ్ విజయ్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. సోదరుడు విజయ్‌కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు మరింత మంచి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
బెంగాల్‌లో బీజీపీకి వైఎస్ జగన్ అభినందనలు
పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఓటమి పట్ల వైఎస్ జగన్ సానుభూతి తెలియజేశారు. దీదీ(మమతా బెనర్జీ) ప్రభుత్వం ఓటమి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. పశ్చిమ బెంగాల్ అతిపెద్దగా పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీకి అభినందనలు తెలిపారు. అలాగే అక్కడ గెలిచిన ఇతర అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు.

A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026


