breaking news
LSG
-
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం
2026 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌ను నియమించుకుంది. కేకేఆర్ నుంచి తాజాగా బయటికి వచ్చిన భరత్ అరుణ్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.అరుణ్ కేకేఆర్ 2024 సీజన్లో విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్లో కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఛాంపియన్‌గా నిలిచింది. అరుణ్ అంతకుముందు టీమిండియా తరఫున కూడా అద్భుతాలు చేశాడు. 2014-2021 వరకు భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా పని చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు.అరుణ్ 2022లో కేకేఆర్‌తో జతకట్టి నాలుగు సీజన్ల పాటు ఆ జట్టుతో కొనసాగాడు. తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవి నుంచి వైదొలగడంతో అరుణ్ కూడా బయటికి వచ్చేశాడు. లక్నో బౌలింగ్ కోచ్‌గా అరుణ్ ఏడాది మొత్తం అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మధ్యలో వేరే ఏ ఒప్పందాలు చేసుకోకూడదు. దీనికి సమ్మతించే అరుణ్ సంజీవ్ గెయెంకా జట్టుతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.వాస్తవానికి ఇప్పటివరకు లక్నోకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్ లేడు. స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్ ప్రవీణ్ తాంబేతో పని కానిచ్చేస్తుంది. తాజాగా అరుణ్‌ను స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకోవడంతో లక్నో బౌలింగ్ విభాగం బలపడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మెంటార్‌గా ఉన్నాడు. గత సీజన్లో అతనే బౌలింగ్ కోచ్ బాధ్యతలను మోశాడు.2022 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో తొలి రెండు సీజన్లు మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరగా.. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు గత సీజన్లోనే కేఎల్ రాహుల్‌ను మార్చి రిషబ్ పంత్‌ను కొత్త కెప్టెన్‌గా తెచ్చుకుంది. పంత్‌కు లక్నో యాజమాన్యం రికార్డు స్థాయిలో 27 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకుంది.గత సీజన్లో ఇతర జట్లతో పోలిస్తే లక్నో బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపించింది. ఆ జట్టులో ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్ పేసర్లుగా ఉండగా.. మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఉన్నారు. -
మాంచెస్టర్ టెస్ట్ హీరోలు.. కేఎల్ రాహుల్‌కు క్రెడిట్ ఇవ్వని ఎల్ఎస్జీ
మాంచెస్టర్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్న టీమిండియా హీరోలు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులు, విశ్లేషకులు, వారు, వీరు అన్న తేడా లేకుండా అందరూ పై నలుగురిని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) న భూతో న భవిష్యతి అన్న రీతిలో బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్‌ను డ్రా చేశారు.పై నలుగురిలో గిల్, జడ్డూ, సుందర్ సెంచరీలు చేయగా.. రాహుల్ తృటిలో ఆ మార్కును చేజార్చుకున్నాడు. స్టోక్స్ అద్బుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాహుల్ మూడంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయాడు. రాహుల్ సెంచరీ చేయకపోయినా, చారిత్రక ఇన్నింగ్స్ ఆడి, ఇంగ్లండ్ గెలుపును అడ్డుకునేందుకు తొలి మెట్టు పేర్చాడు.అంకెల విషయాన్ని పక్కన పెడితే సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గిల్‌తో పాటు రాహుల్ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోతుంది. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడన్న విషయం తప్పించి, సెంచరీలు చేసిన గిల్, జడ్డూ, సుందర్‌తో పాటు రాహల్‌ను కూడా వేనోళ్ల పొగడాల్సిందే.The men who made it happen 🫡 pic.twitter.com/6zST20o0Dp— Lucknow Super Giants (@LucknowIPL) July 28, 2025ఇదిలా ఉంటే, ఐపీఎల్లో రాహుల్ మాజీ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం అతని ఇన్నింగ్స్‌ను విస్మరించి, మిగతా ముగ్గురికి క్రెడిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇవాళ (జులై 28) ఉదయం ఎల్ఎస్జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలను నుంచి పోస్ట్ చేస్తూ.. The men who made it happen అంటూ గిల్, జడ్డూ, సుందర్‌కు మాత్రమే క్రెడిట్ ఇచ్చింది. ఇందులో రాహుల్ ప్రస్తావన లేకపోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. రాహుల్ అంటే ఎందుకంత చిన్న చూపు అంటూ ఎల్ఎస్జీకి అక్షింతలు వేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మ్యాచ్ భారత్ నుంచి చేజారకుండా ఉండటంలో రాహుల్‌ది కూడా ప్రధానపాత్ర అని అతని అభిమానులు అంటున్నారు. కాగా, ఎల్ఎస్జీ యాజమాన్యానికి రాహుల్ విషయంలో ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. రాహుల్ తమ ఫ్రాంచైజీని వదిలి ఢిల్లీకి వెళ్లాడన్న అక్కసుతో వీలు చిక్కినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తుంటుంది. -
RCB Vs LSG: వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జితేశ్.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది.మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్‌తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ మార్ష్
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర ఆటగాడు మిచెల్ మార్ష్ టీ20ల్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 115వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 201 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 136 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 31 అర్ద సెంచరీల సాయంతో 5000 పరుగుల మార్కును దాటాడు.ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్‌లో మార్ష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్ 12 ఓవర్ల అనంతరం 45 పరుగులతో అజేయంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచి అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మార్ష్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్ద సెంచరీల సాయంతో 607 పరుగులు చేసి పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కష్టాలు కొని తెచ్చుకుంది. లక్నో ఆదిలోనే బ్రీట్జ్కీ (14) వికెట్ కోల్పోయినప్పటికీ.. రిషబ్ పంత్ (59), మిచెల్ మార్ష్ (47) విధ్వంసం సృష్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 131/1గా ఉంది.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్‌ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా ఎందుకో ఈ జట్టు విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం పోటీలో గుజరాత్, ఆర్సీబీ ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
IPL 2025: లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
లక్నోపై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ (227/3) చేసింది. అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 156/4జితేశ్ శర్మ 22, మయాంక్ అగర్వాల్ 32నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ11.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆయుశ్ బదోనికి క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (54) ఔటయ్యాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీవరుస బంతుల్లో ఆర్సీబీ వికెట్లు వికెట్లు కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో పాటిదార్, లివింగ్‌స్టోన్ వరుసగా ఔటయ్యారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 90 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి రజత్ పాటిదార్ (14) ఔటయ్యాడు. విరాట్‌కు (42) జతగా లివింగ్‌స్టోన్ క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ5.4వ ఓవర్- 61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో దిగ్వేశ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (30) ఔటయ్యాడు. కోహ్లికి (29) జతగా పాటిదార్ క్రీజ్‌లోకి వచ్చాడు.ఒకే ఓవర్లో 4 ఫోర్లు బాదిన కోహ్లి228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. విలియమ్ ఓరూర్కీ వేసిన రెండో ఓవర్లో కోహ్లి ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇదే ఓవర్లో సాల్ట్ కూడా ఓ ఫోర్ కొట్టాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 39/0గా ఉంది. సాల్ట్ 17, కోహ్లి 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శతక్కొటిన పంత్.. లక్నో భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ సెంచరీలక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. బెంగళూరుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు.రెండో వికెట్ కోల్పోయిన లక్నో15.3వ ఓవర్- 177 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (67) ఔటయ్యాడు. రిషబ్ పంత్ 83 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 14 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 150/1మిచెల్ మార్ష్ 54, రిషబ్ పంత్ 7012 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 127/1మిచెల్ మార్ష్ 45, రిషబ్ పంత్ 58ధాటిగా ఆడుతున్న పంత్ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ ధాటిగా ఆడుతున్నాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో మిచెల్ మార్ష్ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 84/1గా ఉంది.6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 55/1మిచెల్ మార్ష్ 15, రిషబ్ పంత్ 20తొలి వికెట్ కోల్పోయిన లక్నో2.4వ ఓవర్- 25 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. నువాన్ తుషార బౌలింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2025లో ఇవాళ (మే 27) చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో వేదికగా ఎల్ఎస్జీ, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w/c), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఓర్కేఇంపాక్ట్ సబ్స్ - ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి -
PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (4 బంతుల్లో 1) విఫలమైనా, మిగతా బ్యాటర్లంతా సత్తా చాటారు. వన్‌డౌన్‌లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45, నేహల్ వధేరా 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ తాండవం చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 33 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝులిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 73 పరుగులకే తమ కీలక బ్యాటర్ల వికెట్లన్నీ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో టాపార్డర్ పేక మేడలా కూలింది. అర్షదీప్ 27 పరుగులకే మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), నికోలస్ పూరన్‌ను (6) ఔట్ చేశాడు. ఆతర్వాత ఒమర్జాయ్.. రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్‌ను (11) పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ ఔటయ్యే సమయానికి (16.4వ ఓవర్) లక్నో 20 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండింది. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్ తొలి బంతికి బదోని కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్షదీప్ 3, ఒమర్జాయ్ 2, జన్సెన్, చహల్ తలో వికెట్ తీసి లక్నోను దెబ్బ కొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్‌కు చేరువయ్యింది. ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్ రేట్ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్ మాత్రమే మైనస్‌లో ఉంది. లక్నో ఒక వేళ మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి.మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాము. రాంగ్ టైమ్‌లో కీలక క్యాచ్‌లు వదిలేశాము. అది బాగా దెబ్బకొట్టింది. జారవిడిచిన క్యాచ్‌ల ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని అనుకున్నాము. మేము ఆదిలోనే లయ తప్పాము. అక్కడే మ్యాచ్ కోల్పోయాము. ఇప్పటికీ మా ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్‌లను గెలిస్తే, మేము ఖచ్చితంగా రేసులో ఉంటాము.సీజన్ మొత్తంలో మా టాపార్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అయితే ప్రతి మ్యాచ్‌లో వారి నుంచే ఆశించలేము. ప్రతిసారి వారు జట్టును గెలిపించలేరు. మిగతా వారు కూడా బాధ్యత తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్‌లో మేము భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అది తీవ్రంగా బాధించింది -
IPL 2025: లక్నోపై చెన్నై విజయం
-
LSG VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై గెలిచిన తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో ధోని ముగ్గురిని ఔట్ చేయడంలో భాగం కావడంతో పాటు ఛేదనలో అతి మూల్యమైన ఇన్నింగ్స్ (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) ఆడాడు. ఫలితంగా సీఎస్కే లక్నోను వారి సొంత ఇలాకాలో (అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్టేడియం) చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునే సమయానికి ధోని వయసు 43 ఏళ్ల 282 రోజులు. ధోనికి ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది. ప్రవీణ్ 42 ఏళ్ల 200 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2014 సీజన్లో అబుదాబీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్ ఈ ఘనత సాధించాడు.ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న అతి పెద్ద వయస్కులుఎంఎస్ ధోని- 43 ఏళ్ల 282 రోజులుప్రవీణ్ తాంబే- 42 ఏళ్ల 200 రోజులుషేన్ వార్న్- 41 ఏళ్ల 211 రోజులుఆడమ్ గిల్‌క్రిస్ట్- 41 ఏళ్ల 181 రోజులుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. ఓ దశలో కష్టాలు ఎదుర్కొన్నటికీ శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని సత్తా చాటడంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సీఎస్కే ఇన్నింగ్స్‌కు తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) గట్టి పునాది వేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. రాహుల్ త్రిపాఠి (9) వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) కూడా నిరాశపరిచారు. ధోని, దూబే ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్కేను గెలిపించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మర్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సీఎస్కే విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరమైనప్పుడు.. దూబే, ధోని జోడీ శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. మూడో బంతికి దూబే బౌండరీ బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు. -
IPL 2025: ముదురుతున్న 'ఈడెన్' పిచ్ వివాదం
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీకి సొంత మైదానమన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఆ జట్టుకు హోం అడ్వాంటేజ్ అన్నదే లేకుండా పోయింది. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. దీనికి కారణం అక్కడి పిచ్ అని కేకేఆర్ సారధి అజింక్య రహానే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పిచ్‌ను స్పిన్‌కు అనుకూలంగా మార్చమని ఈడెన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడం లేదని అన్నాడు.తాజాగా ఈడెన్‌లో కేకేఆర్ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమికి కూడా పిచ్చే కారణమని రహానే సహా కేకేఆర్ యాజమాన్యం భావిస్తుంది. ఈ ఓటమి తర్వాత కేకేఆర్‌కు చెందిన ఓ కీలక అధికారి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సభ్యులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పిచ్‌పై తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా సదరు కేకేఆర్ అధికారి ఓ క్యాబ్ సభ్యుడితో వ్యంగ్యంగా చర్చించినట్లు తెలుస్తుంది.ముదురుతున్న వివాదంబెంగాలీ వార్తా పత్రిక సంగ్బాద్ ప్రతిదిన్ నివేదిక ప్రకారం.. ఈడెన్ పిచ్‌పై క్యూరేటర్ సుజన్ ముఖర్జీ, కేకేఆర్ యాజమాన్యం మధ్య వివాదం ముదురుతున్నట్లు తెలుస్తుంది. లక్నో చేతిలో ఓటమి అనంతరం ఓ కేకేఆర్ అధికారి ఈడెన్ పిచ్ క్యూరేటర్‌ను ఉద్దేశిస్తూ.. అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సిందని వ్యంగ్యంగా అన్నట్లు సమాచారం.లక్నోతో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారధి రహానే కూడా క్యూరేటర్ సుజన్ ముఖర్జీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే వివాదం పెద్దమవడం ఇష్టం లేక వదిలిపెట్టినట్లున్నాడు. సుజన్ ఇదివరకే మీడియా ప్రచారం పొందారని రహానే ఆ సందర్భంగా అన్నాడు.పిచ్ విషయాన్ని పక్కన పెడితే.. ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కేకేఆర్ ఓడిన మూడు మ్యాచ్‌లు హోం గ్రౌండ్ ఈడెన్‌లో ఓడినవే కావడం విశేషం. కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో రేపు (ఏప్రిల్ 11) సీఎస్కేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగనుంది.సీఎస్కేతో మ్యాచ్‌కు కేకేఆర్ జట్టు (అంచనా)..డికాక్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రమణ్‌దీప్ సింగ్, రఘువంశీ, రసెల్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సన్ జాన్సన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
KKR VS LSG: మళ్లీ ఓవరాక్షన్ చేసిన హర్షిత్ రాణా
గత ఐపీఎల్ సీజన్లో ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ ద్వారా బాగా పాపులరై ఏకంగా టీమిండియాలో స్థానం సంపాధించిన కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా ఈ సీజన్లో మళ్లీ తన ఓవరాక్షన్‌ను మొదలు పెట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 8) జరుగుతున్న మ్యాచ్‌లో రాణా మరోసారి అతి సంబరాలు చేసుకున్నాడు. లక్నో ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆనందంలో 'బయటికి వెళ్లు' అన్నట్లుగా సైగ చేశాడు. ఈ అతి కారణంగా రాణా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్డ్లోని ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది.ఈ నిబంధన ప్రకారం ఓ ఆటగాడు మరో ఆటగాడిని అవమానించే రీతిలో భాషను లేదా సంజ్ఞలను చేయకూడదు. ఔటైన బ్యాటర్‌ని ఉద్దేశిస్తూ అతిగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఈ నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ కూడా రాణా తరహాలోనే అతి సంబరాలు చేసుకుని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి (జరిమానా) గురయ్యాడు. దిగ్వేష్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నోట్ బుక్ సంబరాలు చేసుకోవడాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది.ఇదిలా ఉంటే, లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కేకేఆర్ భారీగా పరుగులు సమర్పించుకుంది. రాణా సహా ప్రతి కేకేఆర్ బౌలర్‌ను లక్నో బ్యాటర్లు ఉతికి ఆరేశారు. రాణా 2 వికెట్లు తీసినా తన కోటా 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. లక్నో బ్యాటర్లు మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (36 బంతుల్లో 87; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌కు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆ జట్టు కూడా లక్నో స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్ అయ్యర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. -
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు.. వారం మధ్యలో ఇలా ఎందుకంటే..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్, సీఎస్కే ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుండగా.. రాత్రి మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లన్పూర్ స్టేడియంలో జరుగనుంది.వారం మధ్యలో ఎందుకంటే..?తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు లేవు. అయితే ఏప్రిల్ 6న జరగాల్సిన కేకేఆర్, లక్నో మ్యాచ్‌ను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో కోల్‌కతా పోలీసులు మ్యాచ్‌కు భద్రతా ఏర్పాట్లు చేయలేమని చెప్పారు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్‌ను వాయిదా వేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీఐని కోరింది. దీంతో కేకేఆర్, లక్నో మ్యాచ్ నేటి మధ్యాహ్నానికి వాయిదా పడింది.ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..కేకేఆర్: క్వింటన్ డికాక్/రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో దుమ్మురేపుతున్న పంజాబ్ వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్కేతో తలపడనుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. సీఎస్కే నాలుగింట మూడు ఓడి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 2022 సీజన్ నుంచి జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు పంజాబే గెలిచింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి/అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ -
ఐపీఎల్-2025 షెడ్యూల్లో మార్పు
ఐపీఎల్ 2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఏప్రిల్ 6న (ఆదివారం) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8కి వాయిదా పడింది. ఏప్రిల్ 8న (మంగళవారం) ఈ మ్యాచ్ అదే వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) కోల్‌కతా పోలీసుల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను సవరించింది. ఏప్రిల్ 6న శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదే రోజు మ్యాచ్ జరుగనుండటంతో కోల్‌కతా పోలీసులకు మ్యాచ్ భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తేదీని వాయిదా వేయాలని క్యాబ్, కోల్‌కతా పోలిసులు బీసీసీఐని కోరారు. వారి అభ్యర్ధన మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను మార్చింది. కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడిన విషయాన్ని బీసీసీఐ నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్ మినహా మిగతా షెడ్యూల్లో ఎలాంటి మార్పులుండవని స్పష్టం చేసింది.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6న రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. కేకేఆర్, లక్నో మ్యాచ్ మధ్యాహ్నం షెడ్యూలై ఉండగా.. అదే రోజు రాత్రి (7:30) సన్‌రైజర్స్, గుజరాత్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడగా.. గుజరాత్, సన్‌రైజర్స్ మ్యాచ్ యధాతథంగా జరుగనుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం కేకేఆర్, లక్నో మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి (7:30) చండీఘడ్‌లో పంజాబ్, సీఎస్కే ఢీకొంటాయి.ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఇవాళ (మార్చి 29) అహ్మదాబాద్ వేదికగా ముంబై, గుజరాత్ తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో భంగపడ్డాయి. నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత సఫలమైన జట్టుగా ఆర్సీబీ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
-
MI vs LSG: లక్నో గెలిస్తేనే ఆశలు సజీవం!
-
SRH vs LSG: ఏమా పరుగుల విధ్వంసం.. లక్నో చిత్తు
-
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
-
ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్‌కు నిన్నటి (మే 5) కేకేఆర్-లక్నో మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమన్‌దీప్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అర్శిన్ కులకర్ణి ఆడిన షాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు రమన్‌దీప్ సింగ్ పెద్ద విన్యాసమే చేశాడు. తాను ఫీల్డింగ్ చేసే డైరెక్షన్ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్ అర్శిన్ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్ అనంతరం రమన్‌దీప్‌ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్ స్టార్క్, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రసెల్ రమన్‌దీప్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024 ఈ మ్యాచ్‌లో రమన్‌దీప్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ (6 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్‌దీప్‌తో పాటు సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్ రాణా (3.1-0-24-3), వరుణ్ చక్రవర్తి (3-0-30-3), రసెల్ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో కేకేఆర్ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో నరైన్, రమన్‌దీప్‌లతో పాటు ఫిలిప్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్‌లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్‌గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్‌రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రోసోవ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్].సీఎస్కే: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే. [ఇంపాక్ట్ సబ్: మతీష పతిరణ]లక్నో-కేకేఆర్ మ్యాచ్ విషచయానికొస్తే.. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో 10లో 6 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ తదుపరి ఆడబోయే నాలుగు మ్యాచ్‌ల్లో మరో రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుండగా.. లక్నో నాలుగులో కనీసం మూడు మ్యాచ్‌లైనా గెలిస్తే ఫ్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. లక్నో నాలుగులో మూడింట గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా సేఫ్‌గా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది.కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 11), గుజరాత్ (మే 13), రాజస్థాన్ రాయల్స్‌తో (మే 19) తలపడాల్సి ఉండగా.. లక్నో సన్‌రైజర్స్ (మే 8), ఢిల్లీ (మే 14), ముంబై ఇండియన్స్ (మే 17) జట్లను ఢీకొట్టాల్సి ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. లక్నోపై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 3, లక్నో ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరసారిగా జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆరే పైచేయి సాధించింది. ఏప్రిల్ 14న జరిగిన ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.తుది జట్లు (అంచనా)..లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్కేకేఆర్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
ముంబైకి షాక్ ఇచ్చిన లక్నో
-
రాయల్స్ రాజసమా? లక్నో సూపర్ షోనా.
-
స్టాక్స్ వ్యూ
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.427 ; టార్గెట్ ధర: రూ.546 ఎందుకంటే: కంపెనీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 25 శాతం పెరిగాయి. ఎల్ఎన్జీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు అనుకూలంగా ఉండడం, దహేజ్ టెర్మినల్ విస్తరణ దీనికి ప్రధాన కారణాలు. ఎల్ఎన్జీ ధరలు తక్కువగా ఉండడం, దేశీయంగా గ్యాస్ లభ్యత తక్కువగా ఉండడడం, డిమాండ్ పెరుగుతుండడం.. వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని దీర్ఘకాలంలో కంపెనీ అమ్మకాలు జోరుగా ఉండగలవని అంచనా వేస్తున్నాం. మూడేళ్లలో అమ్మకాలు 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ రంగంలో పోటీ తక్కువగా ఉండడం, దహేజ్, కోచి టెర్మినల్స్ మంచి కాంట్రాక్ట్‌లను సాధించడం, దేశవ్యప్తంగా గ్యాస్‌పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. ఐదేళ్లలో ఎల్ఎన్జీ వినియోగం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. గ్యాస్‌కు డిమాండ్ పెరిగితే ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది మొదటివరసలో ఉంటుంది. నిర్మాణంలో ఉన్న జగదీష్ పూర్–హల్డియా పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే, మరిన్ని ప్రాంతాలకు ఈ కంపెనీ గ్యాస్ సరఫరా చేయగలుగుతుంది. టర్మినల్ వృద్ధి 3 శాతంగా ఉంటుందని భావిస్తూ ఈ షేర్ ఏడాది కాలంలో రూ.546కు , మూడేళ్ల కాలంలో రూ.767కు చేరగలదని అంచనా వేస్తున్నాం. భారత్‌లో ఎల్ఎన్జీకు డిమాండ్ బాగా వుండటం, లేకపోవడం, సరఫరాలు తగినంతగా లేకపోవడం, పోటీ పెద్దగా ఉండకపోవడం, ఎల్ఎన్జీ ధరలు తగ్గే అవకాశాలు అధికంగా ఉండడం.. ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. స్పాట్, స్వల్పకాలిక అమ్మకాల్లో మార్కెటింగ్ మార్జిన్లు తక్కువగా ఉండడం, ఎల్ఎన్జీ ధరలు పెరిగితే నాఫ్తా, తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలకు డిమాండ్ పెరిగి ఎల్ఎన్జీకి డిమాండ్ తగ్గడం, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరిగితే, ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గి, పీఎల్‌ఎన్‌జీ అమ్మకాలు తగ్గడం... ఇవన్నీ ప్రతికూలాంశాలు. బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.529 ; టార్గెట్ ధర: రూ.650 ఎందుకంటే: 2015 ఏప్రిల్‌లో ఈ షేర్ రూ.1,200 గరిష్ట స్థాయిలో ఉంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర 50% వరకూ తగ్గింది. హలోల్ ఇతర ప్లాంట్లలో అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనలు ప్రతికూల ప్రభావం చూపడం, కొన్ని కీలకమైన ఔషధాలకు పోటీ పెరగడం, కొత్త ఔషధ ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం పరిమితంగా ఉండడం.. తదితర అంశాల కారణంగా కంపెనీ షేర్ ధర బాగా తగ్గిపోయింది. అయితే అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న ఔషధాల విలువను, నిలకడగా వృద్ధి చెందుతున్న, నగదు నిల్వలను అందిస్తున్న దేశీయ వ్యాపార విలువను.. ప్రస్తుత షేర్ ధర ప్రతిబింబించడం లేదని చెప్పవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రికవరీ ప్రారంభమవుతుందని భావిస్తున్నాం. హలాల్ ప్లాంట్‌పై ప్రతికూల ప్రభావం తగ్గడం, స్పెషాల్టీ ఫార్మా విభాగంలో రెండు కొత్త ఔషధాలను మార్కెట్లోకి తేనుండడం, దీనికి కారణం కానున్నాయి. అమెరికాలో జనరిక్స్ వ్యాపార విభాగం కంటే ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. పోటీ పెరుగుతుండడంతో జనరిక్స్ వ్యాపార వృద్ధి భవిష్యత్తులో చెప్పుకోదగిన స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నాం. అందుకని ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగంపై దృష్టి సారించే కంపెనీల వృద్ధి జోరుగా ఉండనున్నది. ఇక సన్ ఫార్మా ప్రత్యేక ఔషధ విభాగం 2019–20లో బ్రేక్ఈవెన్కు వస్తుందని అంచనా. ర్యాన్‌బాక్సీ విలీనంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీకి 10 కోట్ల డాలర్ల మేర ఇబిటా ప్రయోజనాలు రావచ్చు. ఈ ఏడాది మార్చి 31 నాటికి కం పెనీ నగదు నిల్వలు 150 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ కంపెనీ ఏడాదికి 70 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ఫ్లోస్ను సాధిస్తోంది. ప్రత్యేక ఫార్మా వ్యాపారంపై 2–3 ఏళ్లుగా చేస్తున్న వ్యూహాత్మక పెట్టుబడులు, దేశీ మార్కెట్లో నిలకడైన వృద్ధి, అమెరికాలో కాంప్లెక్స్ జనరిక్స్‌పై దృష్టి సారించడం కంపెనీకి కలిసొచ్చే అంశాలు.