Dan Christian: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆసీస్‌ సీనియర్‌ క్రికెటర్‌

Dan Christian Announce Retirement From Cricket BBL Season Is Last - Sakshi

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌.. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ డాన్‌ క్రిస్టియన్‌ ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ఆడుతున్న డాన్‌ క్రిస్టియన్‌.. తనకిదే చివరి టోర్నీ అని ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. బీబీఎల్‌ సీజన్‌ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేశాడు. ''ఇన్నాళ్లు ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని.. అలాగే బీబీఎల్‌, ఐపీఎల్‌, కరీబియన్‌ ప్రీమీయర్‌ లీగ్‌, బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌ లాంటి ప్రైవేటు లీగ్స్‌లోనూ పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని'' తెలిపాడు. 

ఇక డాన్‌ క్రిస్టియన్‌ ఆస్ట్రేలియా తరపున 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆసీస్‌ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే ఆడిన క్రిస్టియన్‌ ఓవరాల్‌గా 20 వన్డేలు, 23 టి20 మ్యాచ్‌లు ఆడాడు. లోయర్‌ ఆర్డర్‌లో పవర్‌ఫుల్‌ హిట్టర్‌గా పేరు పొందిన డాన్‌ క్రిస్టియన్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌ కూడా చేయగలడు. వన్డేల్లో 270 పరుగులతో పాటు 20 వికెట్లు, టి20ల్లో 118 పరుగులతో పాటు 13 వికెట్లు పడగొట్టాడు. 2021 తర్వాత డాన్‌ క్రిస్టియన్‌ ఆసీస్‌ తరపున మరో మ్యాచ్‌ ఆడలేదు.

2007-08లో ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ ఆరంభించిన డాన్‌ క్రిస్టియన్‌ లిస్ట్‌-ఏ తరపున 124 మ్యాచ్‌లు, 399 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన డాన్‌ క్రిస్టియన్‌ బ్రిస్బేన్‌ హీట్‌, సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ), ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

చదవండి: సైబర్‌ క్రైమ్‌ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top