ప్రముఖ బాలీవుడ్ సింగర్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ తాజాగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇకపై ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకొనని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఇన్ని రోజులుగా నాపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ థాంక్స్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేయనని వెల్లడించారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందన్నారు. అయితే తన రిటైర్‌మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించలేదు. సినిమాలకు గుడ్‌బై చెప్పిన అర్జిత్ ఇండిపెండెంట్ సింగర్‌గా కొనసాగుతారని సమాచారం.


