BBL 2021-22: Gilchrist Left Open-Mouthed Laurie Evans Big Six Viral - Sakshi
Sakshi News home page

కప్పలా నోరు తెరిచాడు.. ఏమైంది గిల్లీ!

Jan 28 2022 6:24 PM | Updated on Jan 28 2022 10:00 PM

BBL 2021-22: Gilchrist Left Open-Mouthed Laurie Evans Big Six Viral - Sakshi

ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ కప్పలా నోరు తెరిచాడు. బీబీఎల్‌ 11వ సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గిల్లీ.. మ్యాచ్‌లో ఒక బ్యాటర్‌ కొట్టిన షాట్‌కు షాక్‌తో నోరు తెరిచాడు. ఈ సంఘటన పెర్త్‌ స్కార్చర్స్‌ ఇన్నింగ్స్‌లో చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో ఇవాన్స్‌ ఒక బంతిని భారీ సిక్స్‌ కొట్టాడు. లాంగాన్‌ దిశగా వెళ్లిన ఆ సిక్స్‌ స్టాండ్స్‌లోని లోవర్‌ కవర్‌కు తగిలి ప్రేక్షకుల మధ్యలో పడింది. ఇవాన్స్‌ షాట్‌ను కామెంటరీ బాక్స్‌ నుంచి చూసిన గిల్‌క్రిస్ట్‌.. గుడ్‌షాట్‌.. అంటూ కప్పలా కాసేపు నోరు తెరిచాడు. ఆ సమయంలో గిల్‌క్రిస్ట్‌ను కెమెరాలు క్లిక్‌మనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 11) సీజన్‌ విజేతగా పెర్త్‌ స్కార్చర్స్‌ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్‌ స్కార్చర్స్‌ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్‌ స్కార్చర్స్‌ బీబీఎల్‌ టైటిల్‌ గెలవడం  నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్‌ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్‌తో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడిన  పెర్త్‌ స్కార్చర్స్‌ బ్యాట్స్‌మన్‌ లారీ ఇవాన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే పెర్త్‌ స్కార్చర్స్‌ ఆరు ఓవర్లలో 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ ఆస్టన్‌ టర్నర్‌, లారీ ఇవాన్స్‌లు ఇన్నింగ్స్‌ను నిర్మించారు.  ఈ ఇద్దరు కలిసి 59 బంతుల్లో 104 పరుగులు జతచేయడంతో పెర్త్‌ స్కార్చర్స్‌ భారీ స్కోరు చేయగలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement