స్టన్నింగ్‌ క్యాచ్‌.. షాక్‌లో బౌలర్‌, బ్యాట్స్‌మన్‌

Mackenzie Harvey Stunning Catch Shocking To Batsman Alex Hales In BBL - Sakshi

కాన్‌బెర్రా : బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్‌ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌ హైలెట్‌గా నిలిచింది.  హార్వే అందుకున్న క్యాచ్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్‌డైవ్‌ చేసి అందుకున్న తీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. హార్వే సాధించిన ఈ ఫీట్‌ సిడ్నీ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో జరిగింది. (చదవండి : వైరల్‌ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని)

మెల్‌బోర్న్‌ రెనేగేడ్స్‌ బౌలర్‌ మిచెల్‌ పెర్రీ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని అలెక్స్‌ హేల్స్‌ పాయింట్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ తీరు చూస్తే ఎవరైనా ఫోర్‌ అనుకుంటారు. కానీ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న హార్వే ముందుకు డైవ్‌ చేసి స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్‌ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్‌ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు.

ఈ వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. అమేజింగ్‌ హార్వే.. ఇది క్యాచ్‌ ఆఫ్‌ ది టోర్న్‌మెంట్‌ అవుతుందా?  హార్వేను బెస్ట్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అనొచ్చా? దీనిపై మీ కామెంట్‌ ఏంటి అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు ఆటను కుదించారు. మొదట బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ నిర్ణీత 17 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షాన్‌ మార్ష్‌ 87 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, నబీ 33 పరుగులతో రాణించాడు. (చదవండి: క్యారీ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వహ్వా అనాల్సిందే)

అనంతరం 20 ఓవర్లలో 173 పరుగుల సవరించిన లక్ష్యాన్ని సిడ్నీ థండర్స్‌ ముందు ఉంచారు. ఓపెనర్లు ఉస్మాన్‌ ఖాజా, అలెక్స్‌ హేల్స్‌ దాటిగా ఆడడంతో సిడ్నీ థండర్స్‌ వేగంగా పరుగులు సాధించింది. హేల్స్‌ వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి సిడ్నీ థండర్స్‌ 12 ఓవర్లలో 117 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో డక్‌వర్త్‌ లుయీస్‌ పద్దతిలో సిడ్నీ థండర్స్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top