
అడిలైడ్ : బిగ్‌బాష్10 లీగ్‌లో గురువారం అడిలైడ్ స్ట్రైకర్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినా.. అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ అలెక్స్ క్యారీ మ్యాచ్ హీరోగా నిలిచాడు. మొదట బ్యాటింగ్‌లో మెరిసిన కేరీ ఆ తర్వాత కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ వెస్ అగర్ వేశాడు. అగర్ వేసిన బంతి బౌన్స్ అయి లియామ్ లివింగ్‌స్టోన్ బ్యాట్‌ను తాకుతూ క్యారీకి దూరంగా వెళ్లింది. సాధారణంగా చూస్తే క్యాచ్ అందుకోవడం కష్టమే.. కానీ క్యారీ మాత్రం ఒకవైపుకు పడిపోతూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : జహీర్ బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు క్లీన్‌బౌల్డ్)
కాగా అంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్ సమయంలో క్యారీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. కేరీ ఇన్నింగ్స్‌తో అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చర్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. పెర్త్ ఇన్నింగ్స్‌లో జాసన్ రాయ్ 49 పరుగులు, జోష్ ఇన్‌గ్లిస్ 44* రాణించగా.. చివర్లో మిచెల్ మార్ష్ 38 పరుగులు చేసి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
Alex Carey is having some night! What a catch...#BBL10 | @BKTtires pic.twitter.com/ADfNd6f8To
— cricket.com.au (@cricketcomau) December 31, 2020