Unmukt Chand: చరిత్ర సృష్టించిన ఉన్ముక్త్‌ చంద్‌.. ఆ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు

Unmukt Becomes First Indian Male Cricketer To Sign For BBL - Sakshi

Unmukt Becomes First Indian Male Cricketer To Sign For Big Bash League: భారత మాజీ ఆటగాడు, టీమిండియా అండర్‌-19 మాజీ కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌ బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)కు ప్రాతినిధ్యం వహించనున్న తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వచ్చే నెల(డిసెంబర్‌) నుంచి ప్రారంభంకానున్న బీబీఎల్‌ 2021-22 సీజన్‌లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉన్ముక్త్‌.. చాలాకాలంగా టీమిండియా ఆడే అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే భారత్‌ను వీడి యుఎస్‌ఏకు వలస వెళ్లాడు. అక్కడ మేజర్‌ లీగ్‌  క్రికెట్‌ (ఎంఎల్‌సీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న అతను.. సిలికాన్‌ వ్యాలీ స్ట్రయికర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఇదిలా ఉంటే, 2012 అండర్‌-19 ప్రపంచకప్‌లో ఉన్ముక్త్‌ సారధ్యంలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలసిందే. ఆ టోర్నీ ఫైనల్లో ఉన్ముక్త్‌ (111 నాటౌట్‌) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్‌ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా-ఏకు కెప్టెన్‌గా ఎంపికైన అతను 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. అయితే అతనికి భారత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో నిరాశ చెంది యుఎస్‌ఏకు వలస​ వెళ్లాడు. ఉన్ముక్త్‌ కెరీర్‌లో 65 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 120 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో దాదాపు 8000 పరుగులు సాధించాడు. 28 ఏళ్ల ఉన్ముక్త్‌.. ఐపీఎల్‌లో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌ జట్ల తరఫున 21 మ్యాచ్‌లు ఆడి 300 పరుగులు స్కోర్‌ చేశాడు. 
చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోము కదా.. ఇప్పుడు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top