
IPL Scouts Keep Eyes On Vijay Hazare, BBL 2021 & LPL 2021.. జనవరిలో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను కూడా ప్రకటించాయి. ఇక వచ్చే ఐపీఎల్‌కు అహ్మదాబాద్, లక్నోల రూపంలో కొత్త ఫ్రాంచైజీలు రానుండడంతో మెగావేలంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమకు సమాచారం అందించే స్కౌట్స్‌కు పెద్ద పని అప్పజెప్పింది. మెగావేలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021), లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్ 2021)పై ఒక కన్నేసి ఉంచాలని తెలిపాయి.
జై రిచర్డ్‌సన్(రూ.14 కోట్లు, పంజాబ్ కింగ్స్)
భారీ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్‌లను గెలిపించే యువ ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని.. వారిని వేలంలో దక్కించుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని ఆయా ఫ్రాంచైజీలు కోరాయి. ఇంతకముందు కూడా జై రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్ లాంటి ఆటగాళ్లు బీబీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇక విజయ్ హజారే ట్రోపీ ద్వారా పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లాంటి వారికి గుర్తింపు రావడం.. ఆ తర్వాత ఐపీఎల్‌లో దుమ్మురేపడం చూశాం. ఇక టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్‌తో మెరిసిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రస్తుతం ఎల్‌పీఎల్‌లో బిజీగా ఉన్నాడు. అతనితో పాటు మరికొంతమంది ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.