పాపం ఫ్లెచర్‌.. సెకన్‌‌ కూడా గ్యాప్‌ ఇవ్వలేదు | Rocket Arm From D Arcy Short Runs Out Batsman Fletcher In BBL 2020 | Sakshi
Sakshi News home page

వైరల్‌ : సెకన్ల వ్యవధిలో సూపర్‌ రనౌట్‌

Jan 2 2021 3:19 PM | Updated on Jan 2 2021 4:24 PM

Rocket Arm From D Arcy Short Runs Out Batsman Fletcher In BBL 2020 - Sakshi

హోబర్ట్‌ : బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో శనివారం హోబర్ట్‌ హరికేన్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డీ ఆర్సీ షార్ట్‌ చేసిన రనౌట్‌ వైరల్‌గా మారింది. మెరుపు వేగంతో చేసిన ఆ రనౌట్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ క్రేజీ రనౌట్‌ హోబర్ట్‌ హరికేన్‌ ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో చోటుచేసుకుంది. స్కాట్‌ బోలాండ్‌ వేసిన బంతిని అండ్రీ ఫ్లెచర్‌ మిడాఫ్‌ దిశగా పుష్‌ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉ‍న్న కార్ట్‌రైట్‌ పరుగుకు పిలుపివ్వగా.. ప్లెచర్‌ క్రీజు నుంచి పరిగెత్తాడు. (చదవండి : స్టన్నింగ్‌ క్యాచ్‌.. షాక్‌లో బౌలర్‌, బ్యాట్స్‌మన్‌)‌

అప్పటికే బంతిని మెరుపు వేగంతో అందుకున్న షార్ట్‌ నాన్‌స్ట్రైకింగ్‌ వైపు త్రో విసరగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అప్పటికీ ప్లెచర్‌ క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగాడు. డీ ఆర్సీ షార్ట్‌ చేసిన రనౌట్‌ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. షార్ట్‌ ఏంటి ఆ వేగం.. నీ రనౌట్‌తో ఫ్లెచర్‌ బిక్కమొహం వేశాడు. పాపం ఫ్లెచర్‌కు సెకన్‌ కూడా గ్యాప్‌ ఇవ్వలేదు.. అంటూ కామెంట్లు చేశారు. (చదవండి : ఆస్పత్రిలో చేరిన సౌరవ్‌ గంగూలీ)

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన హోబర్ట్‌ హరికేన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మలన్‌ 75 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ 70 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడినా అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. అటు హరికేన్‌ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ పరాజయం మూటగట్టుకుంది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement