ఔట్‌ అని వేలు ఎత్తాడు.. వెంటనే లేదు లేదు అన్నాడు! | Umpire gives Ashton Turner out caught behind the quickly Return his decision | Sakshi
Sakshi News home page

ఔట్‌ అని వేలు ఎత్తాడు.. వెంటనే లేదు లేదు అన్నాడు!

Jan 2 2022 2:50 PM | Updated on Jan 2 2022 2:56 PM

Umpire gives Ashton Turner out caught behind the quickly Return his decision - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా  మెల్బోర్న్ స్టార్స్- పెర్త్‌ స్కార్చర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పెర్త్‌ స్కార్చర్స్‌ ఇన్నింగ్స్ 14వ వేసిన జేవియర్ క్రోన్ బౌలింగ్‌లో  అష్టన్ టర్నర్‌ పుల్ షాట్‌ ఆడాడు. అయితే బంతి అతడి హెల్మెట్‌కు తగిలి కీపర్‌ చేతికి వెళ్లింది. దీంతో కీపర్‌తో పాటు మెల్‌బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా వేలు ఎత్తాడు. అయితే వెంటనే బంతి హెల్మెట్‌ను తాకినట్లు గ్రహించి తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్‌బాష్‌ లీగ్‌ మేనేజ్మెంట్ ట్విటర్‌లో షేర్‌ చేసింది.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచకున్న పెర్త్‌ స్కార్చర్స్‌  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుర్టిస్ ప్యాటర్సన్(54), మున్రో(40) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. మెల్‌బోర్న్‌ బౌలర్లలో  హరీస్ రవూఫ్, కైస్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో 50 పరుగుల తేడాతో పెర్త్‌ స్కార్చర్స్‌ విజయం సాధించింది.

చదవండి: SA vs IND: "అతడు వైస్ కెప్టెన్ అవుతాడని అస్సలు ఊహించలేదు"

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement