Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ys Jagan To Vinukonda On July 19th
రేపు వినుకొండకు వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో ఫోన్‌ మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. రేపు తానే స్వయంగా వినుకొండ వస్తానని బ్రహ్మనాయుడికి వైఎస్‌ జగన్‌ తెలిపారు.కాగా, సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.’’ అని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.‘‘కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Attacks High Tensions In Punganur Latest News Updates
టీడీపీ విధ్వంసకాండ.. పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత

చిత్తూరు, సాక్షి: పుంగనూరులో ఈ ఉదయం నుంచి మొదలైన తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లు, వాహనాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్నాయి పచ్చ పార్టీ శ్రేణులు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించగా.. ఈ ఉదయం నుంచి ఉద్రిక్తవాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే మిథున్‌రెడ్డి మాత్రం తన పర్యటన కొనసాగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయనపైనా దాడి జరిగింది. అక్కడి నుంచి టీడీపీ దాడులు ఇంకా తీవ్ర తరం అయ్యాయి. వైఎస్సార్‌సీసీ నేతలపై రాళ్లు రువ్వుతున్నారు. వాళ్ల వాహనాలకు నిప్పుడు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. మిథున్‌రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగా.. టీడీపీ నేతలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటిపైకి రాళ్లు రువ్వారు. రెడ్డప్ప కారుకు నిప్పు పెట్టారు. సంబంధిత వార్త: ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడిమరోవైపు రెడ్డప్ప ఇంట్లోనే ఉన్న మిథున్‌రెడ్డి.. అక్కడి నుంచి బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రెడ్డప్ప నివాసానికి చేరుకున్న ఏఎస్పీ మిథున్‌రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. పుంగనూరులో గతంలో ఈ తరహా దాడులు ఏనాడూ జరగలేదని, చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్‌లోనే దాడులు జరగుతున్నాయని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇలాంటి దాడులకు మేం భయపడమని మిథున్‌రెడ్డి అంటున్నారు.

Kommineni Srinivasa Rao Analysis On Telangana Politics
తెలంగాణలో ‘జంపింగ్స్‌’ గేమ్‌.. తిలాపాపం తలా పిడెకడు!

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో ప్రచారంలోకి వచ్చింది. అది ఏమిటంటే మాజీ మంత్రులు , బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ , హరీష్ రావులు ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపులపై తీవ్రంగా చేస్తున్న విమర్శలు ఒకవైపు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులను సమర్ధిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకోవైపు ఉన్నాయి. ఫిరాయింపు రాజకీయాల విషయంలో ఒకరినే తప్పుపట్టే పరిస్థితి లేదు. తిలాపాపం తలా పిడెకడు అన్నట్లుగా రాజకీయ నేతలు దాదాపు అందరూ ఈ దిక్కుమాలిన రాజకీయానికి పాల్పడుతున్నారు. కొన్నిసార్లు తమ పార్టీని రక్షించుకోవడానికి అయితే, మరికొన్నిసార్లు ఎదుటి పార్టీని దెబ్బతీసేందుకు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరిని ఉద్దేశించి కేటీఆర్ ఒక మాట అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీని వీడి కేశవరావు, కడియం శ్రీహరి వంటివారు వెళ్లారని, పార్టీని వీడడం అంటే తల్లికి ద్రోహం చేసినట్లే అని అన్నారు. వీరిపై స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. సుప్రింకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి ఫిరాయింపుదారులపై అనర్హత ఓటు వేయాలని డిమాండ్ చేశారు. అలాగే హరీష్ రావు కూడా ఘాటైన విమర్శలు చేశారు. గతంలో కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అయినా పార్టీకి ఏమీ కాలేదని కూడా ఆయన చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ వ్యతిరేకులు గతంలో శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ అన్న వ్యాఖ్యల వీడియోని జవాబుగా చూపుతున్నారు. అందులో ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ ,ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు వస్తున్నారంటే అది తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోందని ఆయన ఎద్దేవ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా!బండ్లు ఓడలు అవుతాయి..ఓడలు బండ్లు అవుతాయి అన్న చందంగా తెలంగాణలో బీఆర్ఎస్ అదికారం కోల్పోవడం, కాంగ్రెస్ పవర్ లోకి రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ మొదలైంది. ఈ గేమ్ లో కాంగ్రెస్ పక్షాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ తో పొత్తులో ఉన్న టీడీపీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ కు తోడ్పడుతున్నారా అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రకాష్ గౌడ్,అరికపూడి గాంధీలు కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ముందుగా చంద్రబాబును కలవడం. దాంతో ఆయన సూచన మేరకే వీరు పార్టీ మారారేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీరు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ ను వదలి విజయవాడ వెళ్లిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకున్నారు. 2014 లో పదిహేను మంది టీడీపీ పక్షాన ఎన్నికైతే ముగ్గురు తప్ప మిగిలిన పన్నెండు మంది అప్పటి టీఆర్‌ఎస్‌ లో చేరి పోయారు. ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో బీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసినట్లు ప్రకటించేశారు.అప్పట్లో వీరిపై రేవంత్ రెడ్డి పోరాడారు.సుప్రింకోర్టువరకు వెళ్లే యత్నం చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే పనిలో కేటీఆర్,హరీష్ రావులు ఉండడం విశేషం. ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు.విశేషం ఏమిటంటే 2014 లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన 21 మందిలో మెజార్టీ సభ్యులు టీఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. తదుపరి 2018 లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే పన్నెండు మంది టీఆర్‌ఎస్‌‌లో విలీనం అయిపోయారు. ఈ రకంగా తనకు ఎదురులేని పరిస్థితిని కేసీఆర్ సృష్టించుకున్నారు. ఆ తర్వాత పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుకున్నారు. ఆ పేరుతోనే 2023 ఎన్నికలలో పోటీచేసి కాంగ్రెస్ చేతిలో చతికిల పడ్డారు. పీసీసీ అద్యక్షుడుగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో కేసీఆర్ గేమ్ ముగిసి రేవంత్ ఆట ఆరంభం అయింది. బీఆర్ఎస్‌ ను ఖాళీ చేయించే పని పెట్టుకున్నారు. కేసీఆర్ మాదిరే ఈయన కూడా ఈ వ్యవహారాన్ని సమర్ధించుకుంటున్నారు.తమ ప్రభుత్వ అభివృద్దిని చూసి ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే తాము చూస్తూ ఊరుకుంటామా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో కేటీఆర్,హరీష్ రావు ఎంత గొడవ చేసినా, ఎన్ని విమర్శలు చేసినా వారికి నైతికంగా ఫిరాయింపులపై విమర్శ చేసే హక్కు కోల్పోయారు. బహుశా ఈ నేపద్యంలోనే కేసీఆర్ ఫిరాయింపులను విమర్శిస్తూ బహిరంగంగా మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు.కాకపోతే తన ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను పిలిపించుకుని మాట్లాడి బుజ్జగింపు యత్నాలు చేస్తున్నారు. మళ్లీ అధికారం వచ్చే అవకాశం ఉందని ఆయన విశ్వాసం పాదుకొలిపే యత్నం చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన చిక్కు ఏమిటంటే కాంగ్రెస్ తో పాటు,బీజేపీ , బీఆర్ఎస్ లు కూడా అధికారం కోసం పోటీ పడుతుండడం, ముక్కోణపు రాజకీయం అవడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. అదే బీజేపీ కనుక బాగా బలహీనంగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానప్రతిపక్షంగా పోటాపోటీగా ఉండేది. కాని ఆశ్చర్యంగాబీజేపీ గత లోక్ సభ ఎన్నికలలో పుంజుకుని కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంది.దాంతోబీజేపీ కూడా వచ్చే శాసనసభ ఎన్నికల నాటి బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికైతే బీజేపీ బదులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అందువల్లే పది మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. వారిలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలు టీడీపీలో కూడా సీనియర్ నేతలుగా ఉండేవారు.తదుపరి టీఆర్‌ఎస్‌ లో చేరారు. అక్కడ అధికారం చవిచూసిన వీరు మళ్లీ అధికార పక్షమైన కాంగ్రెస్ లో ప్రవేశించారు. వారంతా కాంగ్రెస్ లో చేరడం వల్ల రేవంత్ కు మరింత బలం వస్తుందని చెప్పవచ్చు.ఇక దానం నాగేందర్,కాలె యాదయ్యలు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో అటు దూకారు. తిరిగి కాంగ్రెస్ పవర్‌ను సాధించడంతో వారు మళ్లీ ఇందులోకి దూకేశారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారం ఎటు ఉంటే అటు చేరడానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇష్టపడుతున్నారు. అధికారంలో లేకపోతే నియోజకవర్గాలలో అసలు పనులు జరగవని, చివరికి పోలీస్ స్టేషన్‌లలో తమ మాట వినరని భయపడుతున్నారు. ఇతరత్రా ప్రభుత్వంతో ఉండే లావాదేవీల రీత్యా అధికారపార్టీలోకి వెళ్లడం మామూలు అయిపోయింది. దానం నాగేందర్ ది ఆసక్తికరమైన స్టోరీ అని చెప్పాలి. 1994లో టీడీపీ వేవ్ లో కాంగ్రెస్ పక్షాన అసిఫ్ నగర్ నుంచి గెలిచారు. 1999లో కూడా ఆయన గెలుపొందారు. కాని 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపీగా పోటీచేయాలని సూచిస్తే,తిరస్కరించి రాత్రికి రాత్రే టీడీపీలో చేరిపోయారు. మళ్లీ గెలవగలిగారు. కాని టీడీపీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎతో ఉన్న సంబందాల రీత్యా ఆయన వెంటనే పార్టీ మారిపోయారు. పద్దతి ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాని ఉప ఎన్నికలో ఓటమి చవిచూడడం ఆయనకు ఎదురుదెబ్బ అయింది. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచారు. 2014 వరకు మంత్రిగా కూడాఉన్నారు. 2014 ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత ఆయన చూపు బీఆర్ఎస్ వైపు మళ్లింది. ఎలాగైతేనేమి ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా బీఆర్ఎస్ సీటు సంపాదించి 2018లో గెలుపొందారు. అలాగే 2023 లో సైతం విజయం సాధించారు. ఆయన ఈసారి గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. దాంతో అధికారంలో ఉన్న కాగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈ విడత పదవికి రాజీనామా చేయకపోగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక అంశాన్ని పెట్టినా, దానిని పాటించడం లేదు.ఇంకో సంగతి ఏమిటంటే దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు భూ కబ్జా ఆరోపణలు చేస్తుండేవారు. ఆయన కాంగ్రెస్ లో చేరడంతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారన్నమాట. ఆయన ఒక్కరనే కాదు. ఇలా పార్టీ మారే ఎమ్మెల్యేలందరికి వారి,వారి కారణాలు ఉంటాయి. టీఆర్‌ఎస్‌ నుంచి మరో ఇరవైమందిని లాగితే బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎలాగైతే గతంలో విలీనం చేసుకుందో ,అదే రీతిలో బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావునుకూడా కాంగ్రెస్ లోకి ఆకర్షించినా, ఆయన పదవికి రాజీనామా చేసి రావడం మంచిదే. ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగడం అంటే రకరకాల వ్యూహాలు ఉండవచ్చు. కొందరికి కాంట్రాక్టులు ఇవ్వవచ్చు. మరికొందరికి ప్యాకేజీలు ఉండవచ్చు.ఇంకొందరు నియోజకవర్గంలో పనులు,ఆదిపత్యం కోసం వెళ్లవచ్చు. రాజకీయాలలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏమిటంటే విపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కన్నా, ఎన్నికలలో పోటీచేసి ఓటమిచెందిన అధికార పార్టీ నేతే పవర్ పుల్ గా ఉండడం. ఆయన ఏమి చెబితే దానినే అధికారులు పాటిస్తూ ఉంటారు. పేరుకు ఎమ్మెల్యేనే కాని ఆయన చెబితే పెద్దగా పనులు జరగవు. దీని దృష్ట్యా కూడా విపక్ష ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరెవరూ ఫిరాయింపుల వైపు చూడడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడమే కారణం కావచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బాగా బలపడితే మాత్రం ఫిరాయింపుల పర్వం కొత్త అంకంలోకి వెళుతుంది. అలాకాకుండా బీఆర్ఎస్ పుంజుకుని శాసనసభ ఎన్నికలలో విజయావకాశాలు ఉన్నాయని జనం భావించే పరిస్థితి ఏర్పడితే ,అప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్లీ ఇటువైపు దూకవచ్చు. ఈలోగానే బీఆర్ఎస్ ను సాద్యమైనంతగా వీక్ చేయాలన్నది రేవంత్ ఆలోచన అన్నది వేరే చెప్పనవసరం లేదు.ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ,తెలుగుదేశంల మద్యే ప్రధాన పోటీ ఉండేది. ఏదో ఒక పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా పోరాడగలిగేది. టీఆర్‌ఎస్‌ ఈ రెండిటిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని రెండు ఎన్నికలలో పోటీచేసింది. 2014 నుంచి సొంతంగానే పోటీచేస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా గణనీయంగా పుంజుకోవడంతో బీఆర్ఎస్‌కు చిక్కులు వస్తున్నాయి. వీటిని అధిగమించగలిగి బీఆర్ఎస్ పోరాటాలు చేయగలిగితే తెలంగాణ రాజకీయాలలో ప్రజల శక్తిగా ఉండి మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా జరుగుతుందా?లేదా? అన్నది తేలడానికి మరో రెండు,మూడేళ్లు పట్టవచ్చు. అధికారం లేనప్పుడు మొహం చాటేసే నేతలు కూడా గణనీయంగానే ఉంటారు. అదేమి ఊహించనిది కాదు. బీఆర్ఎస్ ఇప్పుడున్న రాజకీయాలలో వీలైనంతవరకు ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే మంచిదే. అలా నిలబెట్టుకోలేకపోతే కేసీఆర్ గతంలో చెప్పిన సూత్రం ప్రకారం అది ఆయన తప్పే అవుతుంది. ఫిరాయింపులపై ఏమి మాట్లాడినా అది వారికే తగులుతుంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలను నమ్ముకుని స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

CM Chandrababu U Turn On Law And Order Issue White Paper
పీక్‌ స్టేజ్‌కు పచ్చ మూక హింస.. శ్వేతపత్రంపై వెనక్కి తగ్గిన చంద్రబాబు

సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ హత్యలకు, దాడులకు పాల్పడుతున్నారు. అలాగే, కొన్ని చోట్ల అత్యాచారాలు జరుగుతున్నా మంత్రుల నుంచి సీఎం చంద్రబాబు వరకు ఎవరూ స్పందించడం లేదు.మరోవైపు.. చంద్రబాబు శ్వేతపత్రాల పేరుతో​ ప్రతీరోజు ఏదో ఒక అంశంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పచ్చ మీడియాలో రాసిన వార్తలను శ్వేతపత్రం పేరుతో​ చదవి వినిపిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు రాష్ట్రంలో లా అండ్‌ ఆ‍ర్డర్‌పై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేశారు.కాగా, ఈరోజు శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు భావించిన్పటికీ చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎందుకంటే నిన్న రాత్రి వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ఉన్న నివాసంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇలా టీడీపీ నేతల హింసాకాండ కొనసాగుతున్న క్రమంలో.. లా అండ్‌ ఆర్డర్‌ వైట్‌ పేపర్‌ విడుదల చేస్తే అది తమకే తిప్పి కొడుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో ఇవాళ్టి శ్వేతపత్రం విడుదలపై చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దారుణ హత్యలు, బాలికలపై అత్యాచారాలు, మహిళల హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Ex Minister Anil Kumar Yadav Serious Comments On TDP
‘ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ కాదు.. లోకేశ్‌ ఆర్డర్‌ నడుస్తోంది’

సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతో​ందన్నారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. అలాగే, లా అండ్‌ ఆర్డర్‌ కాదు నారా లోకేశ్‌ ఆర్డర్‌ కనిపిస్తోందని మండిపడ్డారు. వినుకొండ రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కాగా, వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో రషీద్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో..‘రషీద్‌ హత్య ఘటన మనసున్న ప్రతీ ఒక్కరికీ కలచివేస్తోంది. అంత కిరాతమైన దృశ్యాలు ఆ వీడియో కనపిస్తున్నాయి. రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది.అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్ర ప్రదేశ్ ను అత్యాచార ప్రదేశ్…— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 18, 2024 ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చకండి. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతోంది. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ కనిపించడం లేదు. లోకేష్‌ ఆర్డర్‌ మాత్రమే కనిపిస్తోంది. నిన్నటి వినుకొండ వంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి అన్నింటిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దృష్టిపెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఆ ఒకటిన్నర నెలలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

Ys Jagan Tweet On Tdp Attacks
‘పచ్చ’ అరాచకం.. చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.’’ అని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.‘‘కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు విజ్క్షప్తిచేస్తున్నాను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024

No candidates for 18 lakh jobs in financial services sector in India
18 లక్షల జాబ్స్‌.. అభ్యర్థులు కరువు!

దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని వార్తల్లో చూస్తున్నాం. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు వేల సంఖ్యలో అభ్యర్థులు వస్తుండటం గమనిస్తున్నాం. అయితే ఆర్థిక సేవల రంగంలో మాత్రం సరైన అభ్యర్థుల్లేక లక్షల్లో జాబ్స్‌ ఖాళీగా ఉ‍న్నాయి.గత ఏడాది ఆర్థిక సేవల రంగంలో దాదాపు 18 లక్షల ఉద్యోగాలు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయాయని, దీంతో ఆ రంగం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా (ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్) ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.ఆర్థిక సేవల రంగంలో దాదాపు 6,000 మందికి ఉపాధి కల్పిస్తున్న గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీ వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో దాదాపు 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పీటీఐకి తెలిపారు."గత సంవత్సరం, కేంద్ర ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ అందించిన డేటా ప్రకారం, భారత్‌ ఆర్థిక సేవలలో 46.86 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. వాటిలో 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. 18 లక్షల ఉద్యోగాలకు అభ్యర్థులు లేరని చూపిస్తోంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటికి తగిన సామర్థ్యం కలిగిన అభ్యర్థులు లేరు" అని మిశ్రా అన్నారు."బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఎల్లప్పుడూ శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుంది. మీరు ఆన్‌లైన్ జాబ్ సెర్చ్ చేస్తే, ప్రస్తుతం ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) నిపుణులకు 40 రెట్లు అధికంగా ఉద్యోగఖాళీలున్న విషయం తెలుస్తుంది”అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది సీఎఫ్‌పీ నిపుణులు ఉండగా భారత్‌లో 2,731 మంది మాత్రమే ఉన్నారు.

Paras Mhambrey Reveals How Umran Malik Lost Faith Of Captain Comeback advice
అతడు కెప్టెన్‌ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే ఇలా!

టీమిండియాలోకి ఎంత ‘వేగం’గా దూసుకువచ్చాడో.. అంతే త్వరగా జట్టుకు దూరమయ్యాడు కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నెట్‌ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్‌.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.అత్యంత వేగంగా బంతులు విసురుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్‌ మాలిక్‌.. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు.అనంతరం వన్డేల్లోనూ అడుగుపెట్టాడు ఈ స్పీడ్‌గన్‌. అయితే, నిలకడలేమి ప్రదర్శన కారణంగా మేనేజ్‌మెంట్‌ నమ్మకం పోగొట్టుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌.. ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. చివరగా గతేడాది వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో ఆడాడు.ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్‌ మాజీ కోచ్‌ పారస్‌ మాంబ్రే ఉమ్రాన్‌ మాలిక్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు కెప్టెన్‌ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని.. అందుకే జట్టుకు దూరమైపోయాడని పేర్కొన్నాడు.కెప్టెన్‌ నమ్మకాన్ని కోల్పోయాడు‘‘మనలోని ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి. ఓ బౌలర్‌ ఎక్స్‌ప్రెస్‌ పేస్‌ కలిగి ఉండటం అరుదైన అంశం. అతడి శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.అతడు గంటకు 145- 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసినపుడు.. అంతకంటే వేగంగా బంతులు విసరగలడని భావించాం. కానీ అలా జరుగలేదు.కానీ తన బౌలింగ్‌లోని పేస్‌ మాత్రమే తన బలం. అంతేగానీ బౌల్‌ చేసేటపుడు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీ20లలో పూర్తి కంట్రోల్‌ ఉండాలి.అందులో విఫలమైతే కచ్చితంగా కష్టాలు మొదలవుతాయి. బ్యాటర్‌ బాల్‌ను బాదుతూ ఉంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం. అలాంటపుడు కెప్టెన్‌ నమ్మకాన్ని కోల్పోవడం ఖాయం.రంజీలు ఆడమని పంపించాంఅతడికి బౌలింగ్‌పై పూర్తి నియంత్రణ రావాలనే ఉద్దేశంతోనే రంజీలు ఆడమని పంపించాం. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ కచ్చితంగా నైపుణ్యాలు ప్రదర్శించగలగాలి’’ అని పారస్‌ మాంబ్రే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఉమ్రాన్‌ మాలిక్‌ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఎనిమిది టీ20లు, పది వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు.

Meet Shruti Hegde Indias First Miss Universe Petite
వైద్యురాలు కమ్‌ మోడల్‌: తొలి మిస్‌ యూనివర్స్‌ పెటిట్‌గా కన్నడ బ్యూటీ!

అమెరికాలో పొట్టి మహిళల కోసం నిర్వహించే అందాల పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది కన్నడ బ్యూటీ. భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉండే ఈ మోడల్‌ అతిపెద్ద కలను సాకారం చేసుకుంది. ప్రతి అమ్మాయి తాను అందాల రాణిని కావాలని ఆకాంక్షిస్తుంటది. అది సాధ్యం కానీ లక్ష్యమే అయినా పట్టుదలగా దాన్ని సాకారం చేసుకుని మరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ మోడల్‌. ఆమె పేరు శృతి హెగ్డే. ఎవరీమె..? ఎలా ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన కలిగిందంటే..బెంగళూరుకు చెందిన శృతి హెగ్డే అనే వైద్యురాలు మోడల్‌గా మారి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈ అందాల పోటీ అంత సులభమైనది కాదు. ఇది పొట్టి మహిళలకు అవకాశం కల్పించేందుకు 2009లో ప్రారంభించిన అందాల పోటీ. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లంతా అమేజనోనియన్‌ ప్రమాణాల ప్రకారం మరుగుజ్జుగా ఉంటారు. ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో ఈ పోటీలు నిర్వహిస్తారు.నిజానికి శృతి డాక్టర్‌గా పనిచేస్తూ మరోవైపు మోడల్‌గా ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపేరయ్యేది. ఆస్పత్రిలో 36 గంటల షిఫ్ట్‌ల తోపాటు విశ్రాంతి తీసుకొని మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోంది. అందాల రాణి కావాలన్నది ప్రతి అమ్మాయి కల..అయితే తాను జస్ట్‌ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా, దీనికి తన అమ్మ అందించిన సపోర్టు కూడా ఎంతో ఉపయోగపడిందని అంటోంది హెగ్డే. తాను 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఈ పోటీలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో తాను చాలా పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన వైద్య రంగాన్ని, మోడలింగ్‌ కెరీర్‌ని బ్యాలెన్స్‌ చేయడం చాలా సవాలుగా ఉండేది. ఒక్కోసారి విశ్రాంతి తీసుకునేంత తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేదని చెబుతోంది. ఇంతలో 2019లో తనకు గర్భాశయ కణితులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. దీంతో ఓ రెండేళ్లు ట్రీట్‌మెంట్‌తోనే గడిచిపోయింది. ఇక కెరీర్‌ ముగిసిపోయింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనలేను అనుకున్న సమయాన్ని ఆమె తల్లి అందించిన మద్దతుతో తిరిగా మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా మిస్‌ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్‌గా టైటిల్‌ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఈ టైటిల్‌​ గెలిచిందో అప్పుడు ఆమె మీద ఆర్థిక ఒత్తిడి తగ్గింది. అంతకమునుపు ఓ పక్క ట్రీట్‌మెంట్‌ మరోవైపు పోటీల ప్రీపరేషన్‌తో ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. దీంతో పోటీల్లో ప్రదర్శని ఇచ్చేందుకు కేవలం రెండు దుస్తులే ఉండేవి. వాటినే వేర్వురు ప్రదర్శనల్లో ధరించేదాన్ని అని చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పాన్సర్‌లు లభించడంతో ఈ ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం పొందింది. ఆమె కష్టానికి ఫలితమే దక్కి గత నెల జూన్‌ 10న భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌గా కిరీటాన్ని గెలుచుకుంది. (చదవండి: స్పేస్‌లో భోజనం టేస్ట్‌ ఎలా ఉంటుందంటే..!)

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
title
నీట్‌ పేపర్ లీక్‌ కేసు: నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ

పట్నా: నీట్‌ పేపర్‌ లీక్‌, నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా

title
వంద మందిని తీసుకురండి.. బీజేపీకి అఖిలేష్ యాద‌వ్ చుర‌క‌లు

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

title
అప్పుడే నీట్‌ పరీక్షను రద్దు చేస్తాం.. సుప్రీంలో కొనసాగుతున్న విచారణ

ఢిల్లీ: ఢిల్లీ: నీట్ పేపర్‌ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ

title
‘నేతలు గోల్‌గప్పాలు అమ్ముకోవాలా?’: కంగనా

బాలీవుడ్‌ నటి కంగన రాజకీయాల్లోకి ప్రవేశించాక తనదైన ముద్ర వేస్తున్నారు.

title
రీల్స్ చేస్తూ జలపాతంలో పడి ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో ప‌లు ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయి.

NRI View all
title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

title
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు

కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.

title
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి

రోమ్‌: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి

title
టాక్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర

International View all
title
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం

ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిన

title
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ స్క్రీనింగ్‌ టైమ్‌

స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్‌) సమయం క్రమంగా పెరుగుతోంది.

title
చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

బీజింగ్: చైనాలోని జిగాంగ్‌ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి.

title
కోట్లకు పడగలెత్తిన బంగ్లాదేశ్‌ ప్రధాని ఇంటి సేవకుడు

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భవనంలో గతంలో పనిచేసిన సేవకునికి బాగోతం సంచల

title
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా బారినపడ్డారు.

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all