
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేతి గాయం నుంచి కోలుకుంటున్నాడు. టీమిండియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన.. ఆఖరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చేందుకు సన్నద్దమవుతున్నాడు.
అయితే గాయంతో జట్టుకు దూరంగా ఉన్న మ్యాక్సీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నమెంట్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ ఉమెన్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
కోడ్ స్పోర్ట్స్ ప్రకారం.. మాక్స్‌వెల్ మెల్‌బోర్న్ స్టార్స్ హెడ్ కోచ్ ఆండీ క్రిస్టీతో కలిసి పనిచేయనున్నాడు. తన అనుభవాన్ని యువ మహిళా క్రికెటర్లకు పంచేందుకు అతడు సిద్దమయ్యాడు. అయితే మెల్‌బోర్న్ ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
డబ్ల్యూబీబీఎల్ 2025-26 సీజన్ సన్నాహకంగా ఈ స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం బీబీఎల్ జట్లతో పాటు ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ మహిళా క్రికెట్ టీమ్ పాల్గోనుంది. మెల్‌బోర్న్ స్టార్స్ ఉమెన్ తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా అక్టోబర్ 21న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో తలపడనుంది.
కాగా బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ మెన్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కోచ్‌గా సరికొత్త అవతారంలో మాక్స్‌వెల్ కన్పించనున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో మాక్సీకి అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ విధ్వంసకర ఆటగాడు బ్యాటింగ్, ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. కాగా ఈ స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నీ అక్టోబర్ 31 వరకు జరగనుంది. ఆ తర్వాత మాక్స్‌వెల్ ఆసీస్ జట్టుతో కలవనున్నాడు.
భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆసీస్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్,జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మాథ్యూ కుహ్నమెన్