Big Bash League 2021: Melbourne Stars 61 All Out Vs Sydney Sixers - Sakshi
Sakshi News home page

Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం

Dec 7 2021 10:20 AM | Updated on Dec 7 2021 10:59 AM

Melbourne Stars 61 All Out Vs Sydney Thunders - Sakshi

BBL 2021: Melbourne Stars All Out For 61 Vs Sydney Sixers.. బిగ్‌బాష్‌ లీగ్‌ 2021-22లో భాగంగా మెల్‌బోర్న్‌ స్టార్స్‌ దారుణ ఆటతీరు కనబరిచింది. ప్రత్యర్థి విధించిన భారీ టార్గెట్‌ను చేధించలేక 61 పరుగులకే కుప్పకూలింది. కాగా సిడ్నీ సిక్సర్స్‌ 152 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌.. జోష్‌ ఫిలిప్‌(83, 47 బంతులు; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిక్స్‌( 38 బంతుల్లో 76 నాటౌట్‌, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. జేమ్స్‌ విన్స్‌ 44 పరుగులు చేశాడు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 11.1 ఓవర్లలో 61 పరుగులకే ఆలౌటైంది. పీటర్‌ నెవిల్‌ 18 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. హిల్టన్‌ కార్ట్‌రైట్‌ 10 పరుగులు చేశాడు. సిడ్నీ సిక్సర్స్‌ బౌలింగ్‌ దాటికి ఎనిమిది మంది మెల్‌బోర్న్‌ బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరగడం విశేషం. స్టీవ్‌ ఓకిఫీ 4 వికెట్లతో సత్తా చాటగా.. సీన్‌ అబాట్‌ 3 వికెట్లు తీశాడు.

చదవండి: వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement