BBL 2025-26: స్టీవ్ స్మిత్ జ‌ట్టులోకి బాబ‌ర్ ఆజం.. | Babar Azam joins Steve Smith’s Sydney Sixers in his maiden Big Bash League deal | Sakshi
Sakshi News home page

BBL 2025-26: స్టీవ్ స్మిత్ జ‌ట్టులోకి బాబ‌ర్ ఆజం..

Jun 13 2025 7:05 PM | Updated on Jun 13 2025 8:05 PM

Babar Azam joins Steve Smith’s Sydney Sixers in his maiden Big Bash League deal

పాకిస్తాన్ సూప‌ర్ స్టార్ బాబ‌ర్ ఆజం తొలిసారి ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. బీబీఎల్ 2025-26 సీజ‌న్ కోసం బాబర్ ఆజంతో సిడ్నీ సిక్స‌ర్స్ ఫ్రాంచైజీ ఒప్పందం క‌దుర్చుకుంది. ప్రీ డ్రాఫ్ట్ ఒప్పం‍దంలో భాగంగా సిడ్నీ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్‌తో క‌లిసి బాబ‌ర్ సిడ్నీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవ‌కాశ‌ముంది. స్మిత్ గ‌త కొన్ని సీజ‌న్ల‌గా సిక్స‌ర్స్ జ‌ట్టుకే ప్రాత‌నిథ్యం వ‌హిస్తున్నాడు.

"ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌ల‌లో ఒక‌టైన బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవ‌కాశం రావ‌డం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన సిడ్నీ సిక్స‌ర్స్ ఫ్రాంచైజీకి ధ‌న్య‌వాదాలు. జ‌ట్టు విజ‌యాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సిడ్నీ సిక్సర్స్ రిలీజ్ చేసిన ప్రకటనలో ఆజం పేర్కొన్నాడు. 

బీబీబీఎల్ 15వ సీజన్ డ్రాఫ్ట్ జూన్ 19న జరగనుంది. కాగా బాబర్ ఆజం ఇప్పటికే పీఎస్‌ఎల్‌తో పాటు సీపీఎల్‌, ఎల్‌పీఎల్‌, బీపీఎల్ వంటి ప‌లు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడాడు. అయితే పాకిస్తాన్ టీ20 సెట‌ప్ నుంచి బాబ‌ర్ ఆజంతో పాటు మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, షాహీన్ అఫ్రిదిని ప‌క్క‌న పెట్టాల‌ని పీసీబీ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బాబ‌ర్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు ఆస‌క్తిచూపుతున్న‌ట్లు తెలుస్తోంది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా

 

Advertisement
 
Advertisement
Advertisement