BBL 2023: టర్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌ ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్

Perth Scorchers are the BBL champions for the fifth time - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్ జట్టు నిలిచింది. పెర్త్‌ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదవసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ అష్టన్ టర్నర్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్‌ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్‌), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. బ్రిస్బేన్ హీట్‌ బౌలర్లలో  జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ కుహ్నెమాన్, జాన్సెన్‌ తలా వికెట్‌ సాధించారు. 

రాణించిన బ్రెయింట్‌, మెక్‌స్వీనీ
ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్ హీట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బ్యాటర్లలో మెక్‌స్వీనీ(41), బ్రెయింట్‌(14 బంతుల్లో 31) పరుగులతో రాణించారు. ఇక పెర్త్‌ బౌలర్లలో బెహ్రెండోర్ఫ్, కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దీ, టై తలా వికెట్‌ సాధించారు.


చదవండి: 'ఉమ్రాన్‌కు అంత సీన్‌ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top