కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్‌ చేశాడు

Watch Video Of Perth Scorchers Wicket Keeper Crazy Run Out Became Viral - Sakshi

పెర్త్‌: ఆసీస్‌ వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 10) విజయవంతగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ఇప్పటికే ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్‌గా మారి అభిమానుల మనుసులు గెలుచుకుంటున్నాయి. తాజాగా శనివారం పెర్త్‌ స్కార్చర్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ కీపర్‌ జోష్‌  ఇంగ్లిస్‌  సిడ్నీ బ్యాట్సమన్‌ను రనౌట్‌ చేసిన తీరు నవ్వు తెప్పిస్తుంది.

విషయంలోకి వెళితే.. జాసన్‌ బెండార్ఫ్‌ వేసిన బంతిని సామ్‌ బిల్లింగ్స్‌ ఆఫ్‌సైడ్‌ పుష్‌ చేసి నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న అలెక్స్‌ రాస్‌ను పరుగుకు పిలిచాడు. అయితే బెండార్ప్‌ వేగంగా వెళ్లి బంతిని అందుకని ఇంగ్లిస్‌కు త్రో విసిరాడు. అయితే ఇంగ్లిస్‌ మాత్రం బంతిని అందుకునే క్రమంలో తడబడ్డాడు. దీంతో బంతి చేతిలో నుంచి జారి గాల్లోకి లేవడంతో తన చేతిని ఉపయోగించి బంతిని వికెట్ల వైపు విసిరాడు. అదృష్టం బాగుండి వికెట్లను గిరాటేయడంతో అలెక్స్‌ రాస్‌ రనౌట్‌ అయ్యాడు. అయితే ఇంగ్లిస్‌ చర్య ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌కు నవ్వు తెప్పించింది. ఇంగ్లిస్‌.. ఎలాగైతేనేమి కిందా మీద పడి రనౌట్‌ అయితే చేశావంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఈ వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.(చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌ది')

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కొలిన్‌ మున్రో 50, ఆస్టన్‌ టర్నర్‌ 31, జై రిచర్డసన్‌ 20* రాణించారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్‌ 20 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్‌ అయి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో సామ్‌ బిల్లింగ్స్‌ 83 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.(చదవండి: సిడ్నీ టెస్ట్‌: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top