హ్యాట్రిక్‌తో విజృంభించిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ | Ranji Trophy: Tushar Deshpande hat trick puts dominant Mumbai in command against Chandigarh | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌తో విజృంభించిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌

Oct 12 2026 7:25 PM | Updated on Oct 12 2026 7:38 PM

Ranji Trophy: Tushar Deshpande hat trick puts dominant Mumbai in command against Chandigarh

source: IPL X

రంజీ ట్రోఫీ 2026-27లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు, ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడే తుషార్‌ దేశ్‌పాండే చెలరేగిపోయాడు. చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించాడు. ఫలితంగా మ్యాచ్‌పై ముంబై పట్టుబిగించింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (429) చేసిన ముంబై, అనంతరం చండీఘడ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూల్చింది. చండీఘడ్‌ పతనంలో తుషార్‌ దేశ్‌పాండే ప్రధానపాత్ర పోషించాడు. తుషార్‌ చండీఘడ్‌ మిడిలార్డర్‌ను పేకమేడాలా కూల్చాడు. వరుస బంతుల్లో శివమ్‌ బాంబ్రి, దిపేంద్ర కుష్‌, రాజ్‌ బవాను డకౌట్‌ చేశాడు.

తుషార్‌కు (5-17) జతగా మోహిత్‌ అవస్తి (3-9), సిల్వెస్టర్‌ డిసౌజా (2-51) కూడా సత్తా చాటారు. ఈ ముగ్గురు ధాటికి చండీఘడ్‌ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కేవలం​ అర్జున్‌ ఆజాద్‌ (20), నిషంక్‌ బిర్లా (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

అనంతరం ఫాలో ఆన్‌కు దిగిన చండీఘడ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఖాతా తెరవకుండానే వికెట్‌ కోల్పోయింది. ఈ వికెట్‌ కూడా తుషార్‌ ఖాతాలోనే చేరింది. ఈ మ్యాచ్‌లో చండీఘడ్‌ గట్టెక్కడం అసాధ్యం.

ఒక్క సెంచరీ కూడా లేకుండానే భారీ స్కోర్‌ చేసిన ముంబై
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై, ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండానే 429 పరుగులు చేసింది. ముషీర్‌ ఖాన్‌ (65), కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (86), తనుష్‌ కోటియన్‌ (58), మోహిత్‌ అవస్తి (56 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆయుశ్‌ మాత్రే (48), తుషార్‌ దేశ్‌పాండే (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

ఇదీ చదవండి: జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ విఫలమైనా.. ముంబై భారీ స్కోరు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement