
PC: BCCI/IPL.com
IPL Rajasthan Royals vs Gujarat Titans Live Updates:
గుజరాత్‌ను చిత్తు చేసిన రాజస్తాన్
జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు యశస్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ మాత్రమే చెరో వికెట్ సాధించారు.
రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..
సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది.101 పరుగులు చేసిన సూర్యవంశీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది.
35 బంతుల్లో సూపర్ సెంచరీ
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 11 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో సూర్యవంశీ(101), జైశ్వాల్(49) ఉన్నారు.
సూర్యవంశీ విధ్వంసం
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 ఏళ్ల సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవన్షీ(35), యశస్వీ జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..
3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(21), వైభవ్ సూర్యవంశీ(9) ఉన్నారు.
చెలరేగిన గిల్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్(50), సాయిసుదర్శన్(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.
గుజరాత్ రెండో వికెట్ డౌన్..
శుబ్‌మన్ గిల్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 84 పరుగులుచేసిన గిల్.. థీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(37), సుందర్(1) ఉన్నారు.
భారీ స్కోర్ దిశగా గుజరాత్..
15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(30), గిల్(77) ఉన్నారు.
శుబ్‌మన్ గిల్ ఫిప్టీ..
జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు.51 పరుగులతో గిల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు సుదర్శన్(39) ఉన్నారు.
3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 27/0
మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(16), సుదర్శన్(11) ఉన్నారు.
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాజస్తాన్‌కు చాలా కీలకం. గుజరాత్‌పై గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలను రాజస్తాన్ సజీవంగా ఉంచుకుంటుంది.
ఈ మ్యాచ్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మతీషా థీక్షణ,యుద్ద్‌వీర్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. అదేవిధంగా గుజరాత్ తరపున కరీమ్ జనత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్”