
Photo Courtesy: BCCI
మినుకు మినుకు మంటూ ప్లే ఆఫ్స్ అవకాశాలు కలిగిన దశలో రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ సందీప్ శర్మ గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా సందీప్ వేలు ఫ్రాక్చర్ అయినట్లు రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు.

సందీప్ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న విషయాన్ని ఆర్‌ఆర్ యాజమాన్యం అధికారికంగా దృవీకరించింది. సందీప్ గుజరాత్ మ్యాచ్‌లో వేలుకు ఫ్రాక్చర్ అయినప్పటికీ బౌలింగ్‌ను కొనసాగించాడు. ఆ మ్యాచ్‌లో అతను తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి వాషింగ్టన్ సుందర్ వికెట్ తీశాడు.
సందీప్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని రాయల్స్ యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు. సందీప్‌కు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా మంచి పేరుంది. లీగ్ కీలక దశలో సాగుతున్న వేల సందీప్ వైదొలగడం రాయల్స్‌కు పెద్ద మైనస్సే. ప్రస్తుత సీజన్‌లో సందీప్ 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు.
ముంబైతో ఇవాళ (మే 1) జరుగతున్న మ్యాచ్‌లో సందీప్‌కు ప్రత్యామ్నాయంగా ఆకాశ్ మధ్వాల్ చోటు దక్కించుకున్నాడు. మధ్వాల్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్.
రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిదానంగా ఆడుతుంది. రాయల్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఓపెనర్లు రికెల్టన్ (27), రోహిత్ శర్మ (17) ఆచితూచి ఆడుతున్నారు. ఒమర్‌జాయ్ బౌలింగ్ రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 45/0గా ఉంది.
ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. హసరంగ, సందీప్ శర్మ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్ రాయల్స్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వాల్, ఫజల్‌హక్ ఫరూఖీ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
కాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.