
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుక్ ఖాన్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. రషీద్ ఖాన్ 4 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో 12 పరుగులు, రూథర్‌ఫోర్డ్ 3 బంతుల్లో సిక్స్ సాయంతో 7 పరుగులు, శుభ్‌మన్ గిల్ 3 బంతుల్లో 2 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ప్రసిద్ద్ కృష్ణ 3, రషీద్ ఖాన్, సాయి కిషోర్ చెరో 2, సిరాజ్, అర్షద్ ఖాన్, కేజ్రోలియా తలో వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సంజూ శాంసన్ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
యశస్వి జైస్వాల్ (7 బంతుల్లో 6; ఫోర్), నితీశ్ రాణా (3 బంతుల్లో 1), ధృవ్ జురెల్ (4 బంతుల్లో 5; ఫోర్), శుభమ్ దూబే (3 బంతుల్లో 1), తుషార్ దేశ్‌పాండే (3 బంతుల్లో 3), జోఫ్రా ఆర్చర్ (4 బంతుల్లో 4), తీక్షణ (13 బంతుల్లో 5) విఫలమయ్యారు.