IPL 2025, RR VS RCB: సంజూ శాంసన్‌ను టార్గెట్‌ చేస్తున్న అభిమానులు | RR VS RCB: Sanju Samson Lean Patch Continues In IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025, RR VS RCB: సంజూ శాంసన్‌ను టార్గెట్‌ చేస్తున్న అభిమానులు

Apr 13 2025 5:00 PM | Updated on Apr 13 2025 5:08 PM

RR VS RCB: Sanju Samson Lean Patch Continues In IPL 2025

Photo Courtesy: BCCI

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్‌లో శాంసన్‌ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక హాఫ్‌ సెంచరీ చేశాడు. అది కూడా సీజన్‌ తొలి మ్యాచ్‌లో. తాజాగా శాంసన్‌ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో అతడు 19 బంతుల్లో బౌండరీ సాయంతో 15 పరుగులు మాత్రమే చేసి కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో శాంసన్‌ పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత సీజన్‌లో శాంసన్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతుండటంతో రాయల్స్‌ అభిమానులు విసిగిపోయారు. శాంసన్‌ను తిట్టిపోస్తున్నారు. మెగా వేలానికి ముందు కీలక​ ఆటగాళ్లను వదులుకున్న విషయంలోనూ శాంసన్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో రాయల్స్‌ దుస్థితికి శాంసనే కారకుడని విమర్శిస్తున్నారు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో శాంసన్‌ స్కోర్లు..
15(19)
41(28)
38(26)
20(16)
13(11)
66(37)

ఈ మ్యాచ్‌లో స్టంపౌటైన శాంసన్‌ మరో అనవసరపు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో స్టంపౌట్‌తో కలుపుకుని శాంసన్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 6 సార్లు డకౌటయ్యాడు. యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో (ఐపీఎల్‌లో) అత్యధిక సార్లు స్టంపౌటైన రికార్డు ఫాఫ్‌ డుప్లెసిస్‌ పేరిట ఉంది. డుప్లెసిస్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏడు సార్లు స్టంపౌటయ్యాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లు (ప్రస్తుతమున్న వారిలో)..

7 - ఫాఫ్ డుప్లెసిస్
6 - సంజు శాంసన్
5 - మోయిన్ అలీ
5 - దీపక్ హుడా
5 - విరాట్ కోహ్లీ
5 - మన్దీప్ సింగ్
5 - అజింక్య రహానే
5 - డేవిడ్ వార్నర్

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాజ​స్థాన్‌ 15 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. శాంసన్‌ (15), రియాన్‌ పరాగ్‌ (30) ఔట్‌ కాగా.. యశస్వి జైస్వాల్‌ (64), ధృవ్‌ జురెల్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, యశ్‌ దయాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, ప్రస్తుతం రాయల్స్‌ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ ఐదో స్థానంలో ఉంది. రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, మూడింట ఓడగా.. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి రెండిటిలో ఓటమిపాలైంది. 

ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. గుజరాత్‌, లక్నో, కేకేఆర్‌ వరుసగా స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్‌ ఆరు, సన్‌రైజర్స్‌, ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ వరుసగా 8 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement