
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 18) మధ్యాహ్నం సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో (జైపూర్) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా శాంసన్ గత కొన్ని మ్యాచ్‌లుగా దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ నితీశ్ రాణా స్థానంలో సంజూ శాంసన్.. జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్వేనా మపాకా తుది జట్టులోకి వచ్చారు.
పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మూడు మార్పులు చేసింది. మిచెల్ ఓవెన్, మార్కో జన్సెన్, ఒమర్‌జాయ్ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఆ జట్టుకు నామమాత్రమే. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉంది. ఆ జట్లు ఈ మ్యాచ్ గెలిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్తుంది.
తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.
ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్‌లెట్.
ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్