IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్‌.. | Royal Challengers Bengaluru Beat Rajasthan Royals By 11 Runs, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్‌..

Apr 24 2025 11:33 PM | Updated on Apr 25 2025 11:25 AM

Royal Challengers Bengaluru beat Rajasthan Royals by 11 runs

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓటముల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 11 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ ఓట‌మి పాలైంది. ఓ ద‌శలో సున‌యాసంగా గెలిచేలా క‌న్పించిన రాజ‌స్తాన్.. ఆఖ‌రిలో వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోవ‌డంతో ప‌రాజ‌యం చ‌విచూడాల్సి వ‌చ్చింది. 

207 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. రాయ‌ల్స్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్‌(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 49), ధ్రువ్ జురెల్‌(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 47) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన‌ప్ప‌టికి జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్‌, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(70), ప‌డిక్క‌ల్(50) హాఫ్ సెంచ‌రీల‌తో మెర‌వ‌గా.. డేవిడ్‌(23),జితేష్ శ‌ర్మ‌(20) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హ‌స‌రంగ, ఆర్చ‌ర్ త‌లా వికెట్ సాధించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement