ముంబై ఇండియన్స్‌లో కీలక నియామకం | Mumbai Indians have appointed Zubin Bharucha as Director of Performance | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌లో కీలక నియామకం

Aug 22 2026 3:31 PM | Updated on Aug 22 2026 3:47 PM

Mumbai Indians have appointed Zubin Bharucha as Director of Performance

source: Mumbai Indians X

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ క్రికెట్ వ్యవస్థలో కీలక మార్పు చేసింది. మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో విశేష అనుభవం కలిగిన జుబిన్ భరూచాను డైరెక్టర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌గా నియమించింది.

ముంబై ఇండియన్స్‌కు చెందిన బహుళ విభాగాల నాయకత్వం, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి భరూచా పనిచేయనున్నారు. ఆటగాళ్ల అభివృద్ధి, పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్‌లు, దీర్ఘకాలిక ప్రణాళికలను మరింత బలోపేతం చేయడం ఆయన ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి.

ముంబైకి చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్ బ్యాటర్ అయిన భరూచా గతంలో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యువ ప్రతిభను గుర్తించడం, వారికి హై-పెర్ఫార్మెన్స్ స్థాయిలో శిక్షణ అందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.

భారత క్రికెట్‌లో ప్రస్తుతం స్టార్‌ హోదా అనుభవిస్తున్న సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, వైభవ్‌ సూర్యవంశీ ఎదుగుదలలో భరూచా కీలకంగా వ్యవహరించారు.

ముంబై ఇండియన్స్ తమ క్రికెట్ ఎకోసిస్టమ్‌లో ప్రతిభను గుర్తించి, దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధానంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో భరూచా నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. యువ ఆటగాళ్ల అభివృద్ధితో పాటు ప్రస్తుత జట్టు ప్రదర్శనను మరింత మెరుగుపరచడంలో ఆయన అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది.

చదవండి: హార్దిక్‌ పాండ్యాపై కీలక హింట్‌ ఇచ్చిన ముంబై ఇండియన్స్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement