
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్‌లో శ్రేయస్ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.
వధేరా, శశాంక్ మెరుపులు
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.
ఆరంభం వచ్చినా..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. లక్ష్య చేధనలో రాజస్తాన్ ఓపెనర్లు(50), వైభవ్ సూర్యవంశీ(40) అద్బుతమైన ఆరంభం ఆందించారు.
తొలి వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధ్రువ్‌జురెల్(53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో హార్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'