'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్‌.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' | Only MS Dhoni Fans Are REAL, Rest Are PAID: Harbhajan Shcoking Comments | Sakshi
Sakshi News home page

'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్‌.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'

May 18 2025 5:58 PM | Updated on May 18 2025 6:19 PM

Only MS Dhoni Fans Are REAL, Rest Are PAID: Harbhajan Shcoking Comments

క్రికెట‌ర్ల ఫ్యాన్ బేస్‌పై భారత మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీమిండియా దిగ్గ‌జం ఎంఎస్ ధోనికి మాత్ర‌మే నిజ‌మైన అభిమానులు ఉన్నార‌ని, మిగతా క్రికెటర్లంద‌రికి ఉన్న‌ది పెయిడ్ ఫ్యాన్సేన‌ని భ‌జ్జీ వివాద‌స్ప‌ద కామెంట్స్ చేశాడు.

ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో జరిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో హర్భజన్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. కాగా ఐపీఎల్‌-2025 త‌ర్వాత ధోనికి రిటైర్ అయ్యే ఆలోచన లేద‌ని ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని సీఎస్‌కే యాజ‌మాన్యానికి తెలియ‌జేశాడ‌ని శ‌నివారం వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలోనే హర్భజన్ త‌న మ‌నసులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు.

"ఎంఎస్ ధోని త‌ను ఎప్ప‌టివ‌ర‌కు ఆడాల‌నుకుంటే అప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో కొన‌సాగుతాడు. ఒక‌వేళ సీఎస్‌కే యాజ‌మాని నేనే అయితే ధోని విష‌యంలో వేరే నిర్ణయం తీసుకునేవాడిని. నా వ‌ర‌కు అయితే.. ధోనికి ఒక్క‌డికే అసలైన అభిమానులు ఉన్నారు. 

మిగిలిన క్రికెట‌ర్లంద‌రికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. అందులో కూడా కొంత‌మంది పెయిడ్ ఫ్యాన్సే. వారి గురించి మాట్లాడటం అనవసరం. అటువంటి వారి మాట్లాడితే ఈ చర్చ పక్కదారి పడుతుంది" అని హార్భ‌జ‌న్ క్రిక్‌బ‌జ్ షోలో పేర్కొన్నాడు.

ఈ క్ర‌మంలో హార్భ‌జ‌న్ అనుచిత‌ వ్యాఖ్య‌ల‌పై విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ధోనిని కించ‌ప‌రిచేలా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఎంఎస్ ధోని దేశద్రోహి అంటూ ఎక్స్‌లో ప్రచారం చేస్తున్నారు. "SHAME ON DESHDROHI DHONI" అనే కీవర్డ్‌ ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతోంది.
చదవండి: IPL 2025: అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డ‌కౌట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement