IPL 2025: రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ ఘన విజయం | IPL 2025: Gujarat Titans Vs Rajasthan Royals Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ ఘన విజయం

Apr 9 2025 7:08 PM | Updated on Apr 9 2025 11:26 PM

IPL 2025: Gujarat Titans Vs Rajasthan Royals Live Updates And Highlights

Photo Courtesy: BCCI

రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ ఘన విజయం
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 9) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన రాయల్స్‌ 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. 

ఆరో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌
13.2వ ఓవర్‌- 119 పరుగుల వద్ద రాయల్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో శుభమ్‌ దూబే (1) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌
12.2వ ఓవర్‌- 116 పరుగుల వద్ద రాయల్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో సాయి కిషోర్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ శాంసన్‌ (41) ఔటయ్యాడు. 

పీకల్లోతు కష్టాల్లో రాయల్స్‌
7.4వ ఓవర్‌- 218 పరుగుల భారీ ఛేదనలో రాయల్స్‌ 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు​ కష్టాల్లో కూరుకుపోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్‌ ఇచ్చి దృవ్‌ జురెల్‌ (5) ఔటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌.. రియాన్‌ ఔట్‌
6.4వ ఓవర్‌- 60 పరుగుల వద్ద రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కేజ్రోలియా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పరాగ్‌ (26) ఔటయ్యాడు.  

6 ఓవర్లలో 57 పరుగులు.. ధాటిగా ఆడుతున్న శాంసన్‌, రియాన్‌
11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా రాయల్స్‌ ఏమాత్రం తగ్గడం లేదు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 57/2గా ఉంది. శాంసన్‌ (21), రియాన్‌ (25) ధాటిగా ఆడుతున్నారు. 

12 పరుగులకే రెండు వికెట్లు కోలోయిన రాయల్స్‌
2.2వ ఓవర్‌- భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్‌ 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో తొలుత జైస్వాల్‌ ఔట్‌ కాగా.. తాజాగా సిరాజ్‌ బౌలింగ్‌లో నితీశ్‌ రాణా (1) ఔటయ్యాడు.  

టార్గెట్‌ 218.. 11 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
218 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ 11 పరుగుల వద్దనే తొలి వికెట్‌ కోల్పోయింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ (6) ఔటయ్యాడు. సంజూ శాంసన్‌కు జతగా నితీశ్‌ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు.

చెలరేగిన సాయి సుదర్శన్‌.. గుజరాత్‌ భారీ స్కోర్‌
రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌, షారుక్‌ ఖాన్‌ తలో 36 పరుగులు చేయగా.. రాహుత్‌ తెవాతియా 24 (నాటౌట్‌), రషీద్‌ ఖాన్‌ 12, రూథర్‌ఫోర్డ్‌ 7, గిల్‌ 2 పరుగులు చేసి ఔటయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్‌, సందీప్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

82 పరుగుల వద్ద సాయి సుదర్శన్‌ ఔట్‌
82 పరుగుల వద్ద సాయి సుదర్శన్‌ ఔటయ్యాడు. తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 18.2 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 187/5గా ఉంది. తెవాతియా (10), రషీద్‌ ఖాన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
16.1వ ఓవర్‌- 163 పరుగుల వద్ద సందీప్‌ శర్మ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి రూథర్‌ఫోర్డ్‌ (7) ఔటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
15.4వ ఓవర్‌- 156 పరుగుల వద్ద గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో షారుక్‌ ఖాన్‌ (36) స్టంపౌట్‌ అయ్యాడు. సాయి సుదర్శన్‌కు (69) జతగా రూథర్‌ఫోర్డ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. రూథర్‌ఫోర్డ్‌ వచ్చీ రాగానే సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 163/3గా ఉంది.

భారీ స్కోర్‌ దిశగా గుజరాత్‌
ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 124/2గా ఉంది. సాయి సుదర్శన్‌ 59, షారుక్‌ ఖాన్‌ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌.. బట్లర్‌ ఔట్‌
9.6వ బంతి- 94 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో జోస్‌ బట్లర్‌ (36) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. సాయి సుదర్శన్‌ (50) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్‌ ఖాన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

లైన్‌లోకి వచ్చిన బట్లర్‌.. 8 బంతుల్లో 4 బౌండరీలు
ఆరంభంలో నిదానంగా ఆడిన బట్లర్‌ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో లైన్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్‌ ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించిన బట్లర్‌, ఆతర్వాతి ఓవర్‌లో కూడా మరో రెండు బౌండరీలు బాదాడు. సాయి సుదర్శన్‌తో (26 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పాటు బట్లర్‌ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు) కూడా టచ్‌లోకి రావడంతో గుజరాత్‌ స్కోర్‌ 8 ఓవర్లలోనే 81 పరుగులకే చేరింది. 

ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్‌
శుభ్‌మన్‌ గిల్‌ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ ధాటిగా ఆడుతున్నాడు. సాయి 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. సాయికి జతగా బట్లర్‌ (11) ఉన్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 56/1గా ఉంది. 

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌.. కెప్టెన్‌ ఔట్‌
2.1వ ఓవర్‌- 14 పరుగులకే గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (2) జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. సాయి సుదర్శన్‌కు (11) జతగా జోస్‌ బట్లర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (ఏప్రిల్‌ 9) గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ వనిందు హసరంగ దూరమయ్యాడు (వ్యక్తిగత కారణాల చేత). అతని స్థానంలో ఫజల్‌హక్‌ ఫారూకీ తుది జట్టులోకి వచ్చాడు. గుజరాత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది.

ఈ సీజన్‌లో గుజరాత్‌ తొలి మ్యాచ్‌లో ఓడి (పంజాబ్‌), ఆతర్వాత హ్యాట్రిక్‌ విజయాలు (ముంబై, ఆర్సీబీ, సన్‌రైజర్స్‌) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. రాయల్స్‌ విషయానికొస్తే.. ఈ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో (సన్‌రైజర్స్‌, కేకేఆర్‌) ఓడి, ఆతర్వాత వరుసగా సీఎస్‌కే, పంజాబ్‌లపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

తుది జట్లు..

గుజరాత్‌: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌ & వికెట్‌కీపర్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఫజల్‌ హక్‌ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement