
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.
అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్‌లో 100 హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది.