చ‌రిత్ర సృష్టించిన శ్రేయ‌స్‌ అయ్యర్‌ | Shreyas Iyer Breaks MS Dhoni Captaincy Record As India Achieves Most 200 Plus Totals Under His Leadership In T20Is | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన శ్రేయ‌స్‌ అయ్యర్‌

Oct 12 2026 9:04 AM | Updated on Oct 12 2026 9:47 AM

Shreyas-Iyer-Breaks-Dhoni-Captaincy-Record-Most 200 Plus-Totals-T20Is

Photo Credit: Twitter

టీమిండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అంత‌ర్జాతీయ టీ20ల్లో చ‌రిత్ర సృష్టించాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో టీ20లో భార‌త జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవ‌ర్ల‌లో 224 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అయ్య‌ర్ సార‌థ్యంలో టీమిండియా 37వ సారి 200 ప్ల‌స్ స్కోరు సాధించ‌డం విశేషం. 

త‌ద్వారా భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డు (36 సార్లు) బ‌ద్ద‌లుకొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్ తొలి స్థానంలో నిలిచాడు. ఇక శ్రేయ‌స్, ధోని త‌ర్వాత కోహ్లి కెప్టెన్సీలో భార‌త్ 29 సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు చేసింది. ఇక టీ20 కెప్టెన్‌గా అయ్య‌ర్‌కు 19 మ్యాచ్‌ల్లో ఇది 11వ విజ‌యం కాగా.. ఏడు మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలైంది. ఒక మ్యాచ్‌లో ఫ‌లితం రాలేదు. కెప్టెన్‌గా అయ్య‌ర్ విన్నింగ్ ప‌ర్సంటేజీ 57.89 శాతంగా ఉంది.

మ్యాచ్ విష‌యానికొస్తే.. ఆదివారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2–1తో ముందంజ వేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

ఇషాన్‌ కిషన్‌ (37; 6 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (28; 4 ఫోర్లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో చేజ్, షమార్‌ జోసెఫ్, స్ప్రింగర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు చేసి విజయానికి దూరంగా నిలిచింది. కమిల్‌ పూరన్‌ (42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (43; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ 3, నమన్‌ ధీర్‌ 2 వికెట్లు పడగొట్టారు.

ఇదీ చ‌ద‌వండి: 'ఆ రెండు ఓవ‌ర్లే ట‌ర్నింగ్ పాయింట్‌.. లేదంటే ఓడిపోయేవాళ్లం!'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement