'ఆ రెండు ఓవ‌ర్లే ట‌ర్నింగ్ పాయింట్‌.. లేదంటే ఓడిపోయేవాళ్లం!' | Shreyas Iyer Reaction After India Beat West Indies In Third T20I And Reveals What Turned The Match Around, Read Story Inside | Sakshi
Sakshi News home page

'ఆ రెండు ఓవ‌ర్లే ట‌ర్నింగ్ పాయింట్‌.. లేదంటే ఓడిపోయేవాళ్లం!'

Oct 12 2026 8:42 AM | Updated on Oct 12 2026 9:32 AM

IND Captain-Shreyas-Iyer-Winning Comments-Vs WI 3rd T20I Match

Photo Credit: BCCI Twitter

వెస్టిండీస్‌పై మూడో టీ20లో టీమిండియా 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ మాట్లాడాడు. విండీస్ బ్యాట‌ర్లు ఆఖ‌రి వ‌ర‌కు పోరాడ‌డంతో ఒక ద‌శ‌లో ఈ మ్యాచ్‌లో కూడా ఓట‌మి పాల‌వుతామోన‌ని భావించిన‌ట్లు తెలిపాడు. కానీ బౌల‌ర్లు అద్భుతంగా రాణించి భార‌త్‌ను నిల‌బెట్టారని, ఆ రెండు ఓవ‌ర్లు మ్యాచ్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింద‌ని పేర్కొన్నాడు. 

శ్రేయ‌స్ మాట్లాడుతూ.. ''గ‌త మ్యాచ్ అనుభ‌వం ఇంకా నా క‌ళ్ల ముందే మెదులుతుంది. విండీస్ ఎదుట 224 ప‌రుగుల టార్గెట్ పెట్టిన‌ప్ప‌టికీ, నా మ‌దిలో మాత్రం ఏ మూల‌నో చిన్న‌పాటి ఓట‌మి భ‌యం ఉండేది. అయితే మ్యాచ్‌లో మా బౌల‌ర్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ముఖ్యంగా అర్ష‌దీప్‌, ప్రిన్స్‌ యాద‌వ్‌లు వేసిన ఇన్నింగ్స్ 18, 19 ఓవ‌ర్లు మ్యాచ్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింద‌ని చెప్పొచ్చు. అప్ప‌టిదాకా విండీస్ కూడా విజ‌యం దిశ‌గా న‌డిచింది. 

కీల‌క స‌మ‌యంలో అర్ష‌దీప్ రెండు వికెట్లు తీసి వారిపై ఒత్తిడిని పెంచాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో ప్రిన్స్‌ యాద‌వ్ ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాట‌ర్ల‌ను క‌ట్టడి చేశాడు. గెలుపు క్రెడిట్ మాత్రం క‌చ్చితంగా బౌల‌ర్ల‌కు ఇచ్చి తీరాల్సిందే. అంత‌క‌ముందు బ్యాటింగ్‌లో అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 

ఆ ఆరంభాన్ని మా బ్యాట‌ర్లు చాలా స‌ద్వినియోగం చేసుకున్నారు. ఆఖ‌ర్లో తిల‌క్ వ‌ర్మ‌, అక్ష‌ర్ ప‌టేల్‌, నితీశ్ రెడ్డిలు త‌మ బ్యాటింగ్‌తో టీమిండియా స్కోరును 220 ప‌రుగులు దాటించారు. జ‌ట్టు స‌మ‌ష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తోనే మ్యాచ్‌లో విజ‌యం సాధ్య‌మైంది. హైద‌రాబాద్‌లో మ్యాచ్ ఆడ‌డం కోసం ఎదురుచూస్తున్నాం.'' అని చెప్పుకొచ్చాడు.

ఇదీ చ‌ద‌వండి: తిల‌క్ వ‌ర్మ ఖాతాలో అరుదైన రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement