విజయం దిశగా హైదరాబాద్‌ | Hyderabad on the verge of victory in Ranji Trophy | Sakshi
Sakshi News home page

విజయం దిశగా హైదరాబాద్‌

Oct 13 2026 4:14 AM | Updated on Oct 13 2026 4:14 AM

Hyderabad on the verge of victory in Ranji Trophy

రాణించిన రుతిక్‌ యాదవ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్‌ జట్టు విజయంతో ప్రారంభించడం ఖాయమైంది. త్రిపుర జట్టుతో ఇక్కడి సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో జరుగుతున్న ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌పై హైదరాబాద్‌ పట్టు బిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 121/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 103.2 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 160 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. 

ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (122 బంతుల్లో 54; 2 ఫోర్లు)... ఈ మ్యాచ్‌తో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మహబూబ్‌నగర్‌ జిల్లా ప్లేయర్‌ మెండె రుతిక్‌ యాదవ్‌ (150 బంతుల్లో 61; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రాహుల్‌ రాదేశ్‌ (119 బంతుల్లో 40; 1 ఫోర్‌)తో కలిసి రుతిక్‌ యాదవ్‌ ఆరో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో చామా మిలింద్‌ (55 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. 

త్రిపుర కెప్టెన్‌ మణిశంకర్‌ మూరా సింగ్‌ ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్‌ వేయించగా... ఆఫ్‌ స్పిన్నర్‌ సందీప్‌ సర్కార్‌ 96 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. 160 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన త్రిపుర జట్టు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 99 పరుగులు సాధించింది. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే త్రిపుర మరో 61 పరుగులు చేయాలి. హైదరాబాద్‌ బౌలర్లలో కెప్టెన్‌ సిరాజ్‌ 2 వికెట్లు, తనయ్‌ త్యాగరాజన్‌ 3 వికెట్లు తీశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement