చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌.. విరాట్‌ కోహ్లి రికార్డ్‌ బ్రేక్‌ | Matt Renshaw Smashes 190, Breaks Virat Kohli Record For Most Runs With Tailenders In A Test Innings, Read Story Inside | Sakshi
Sakshi News home page

IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌.. విరాట్‌ కోహ్లి రికార్డ్‌ బ్రేక్‌

Oct 11 2026 1:39 PM | Updated on Oct 11 2026 3:09 PM

 Matt Renshaw Surpasses Virat Kohlis Unique Test Record After Slamming 190 vs South Africa

డ‌ర్బ‌న్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ మ్యాట్ రెన్‌షా  (397 బంతుల్లో 190; 21 ఫోర్లు, 1 సిక్స్‌)  విరోచిత సెంచ‌రీతో క‌దం తొక్కాడు. సహచరులంతా విఫలమైన చోట కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 204 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని తొమ్మిదేళ్ల తర్వాత శతకం నమోదు చేశాడు.

కెప్టెన్ క‌మిన్స్ కమిన్స్‌ (43; 6 ఫోర్లు), నాథన్‌ లయన్‌ (27; 5 ఫోర్లు) అతడికి అండగా నిలిచారు. తొమ్మిదో వికెట్‌కు లయన్‌తో కలిసి రెన్‌షా 134 పరుగులు జోడించడంతో జట్టు కోలుకోగలిగింది. ఫ‌లితంగా ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 137.2 ఓవర్లలో 390 పరుగులకు ఆలౌటైంది.  ఇక ఈ మ్యాచ్‌లో భారీ సెంచ‌రీతో చెల‌రేగిన రెన్‌షా ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 2002 త‌ర్వాత ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో టెయిలెండర్లతో కలిసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్‌గా రెన్‌షా నిలిచాడు.

రెన్‌షా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అత‌డు టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి 174 పరుగులు చేశాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త లెజెండ‌రీ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 2016లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చివ‌రి ఆట‌గాళ్ల‌తో క‌లిసి 171 ప‌రుగులు సాధించాడు. తాజా ఇన్నింగ్‌తో కోహ్లి రికార్డును రెన్‌షా బ్రేక్ చేశాడు.

ఇక ప్రోటీస్ బౌల‌ర్ల‌లో వియాన్‌ ముల్డర్‌కు 4, మార్కో యాన్సెన్‌కు 3 వికెట్లు లభించాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా శనివారం ఆట ముగిసే సమయానికి 8.4 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 27 పరుగులు చేసింది.
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌.. వెస్టిండీస్‌ జట్టులోకి డేంజరస్‌ బ్యాటర్‌!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement