IPL 2025: పంజాబ్‌ 11 ఏళ్ల తర్వాత...  | IPL 2025: Punjab Kings Qualify For IPL Playoffs After 11 Long Years, Check Out PBKS Vs RR Match Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025: పంజాబ్‌ 11 ఏళ్ల తర్వాత... 

May 19 2025 4:03 AM | Updated on May 19 2025 4:37 PM

IPL 2025: Punjab kings Qualify for IPL Playoffs After 11 Long Years

ప్లే ఆఫ్స్‌ దశకు అర్హత

రాజస్తాన్‌పై 10 పరుగులతో నెగ్గిన పంజాబ్‌ కింగ్స్‌

మెరిపించిన నేహల్, శశాంక్‌

తిప్పేసిన హర్‌ప్రీత్‌ బ్రార్‌  

జైపూర్‌: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌ టోర్నిలో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు నెగ్గడంతో... పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్‌’ బెర్త్‌ ఖరారైంది. చివరిసారి పంజాబ్‌ కింగ్స్‌ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరింది. 

రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్‌ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్‌ జురేల్‌ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్‌), వైభవ్‌ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3 వికెట్లు తీశాడు. 

ధనాధన్‌ ఆరంభం 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్‌ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్‌ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్‌ 50 స్కోరు చేసేసింది. వైభవ్‌ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్‌ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్‌ (20), పరాగ్‌ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్‌ జురేల్‌ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్‌ బౌలర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు.  

స్కోరు వివరాలు 
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్‌‡్ష (సి) హెట్‌మైర్‌ (బి) తుషార్‌ 9; ప్రభ్‌సిమ్రన్‌ (సి) సామ్సన్‌ (బి) తుషార్‌ 21; ఒవెన్‌ (సి) సామ్సన్‌ (బి) క్వెనా మఫాక 0; నేహల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) ఆకాశ్‌ 70; శ్రేయస్‌ (సి) జైస్వాల్‌ (బి) పరాగ్‌ 30; శశాంక్‌ (నాటౌట్‌) 59; అజ్మతుల్లా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. 
బౌలింగ్‌: ఫజల్‌హక్‌ 3–0–39–0, తుషార్‌ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్‌ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్‌ మధ్వాల్‌ 4–0–48–1. 

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఒవెన్‌ (బి) హర్‌ప్రీత్‌ 50; వైభవ్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) హర్‌ప్రీత్‌ 40; సామ్సన్‌ (సి) యాన్సెన్‌ (బి) అజ్మతుల్లా 20; పరాగ్‌ (బి) హర్‌ప్రీత్‌ 13; జురేల్‌ (సి) ఒవెన్‌ (బి) యాన్సెన్‌ 53; హెట్‌మైర్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్‌) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) యాన్సెన్‌ 0; క్వెన మఫాక (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. 
వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. 
బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–60–0, యాన్సెన్‌ 3–0–41–2, బార్ట్‌లెట్‌ 1–0–12–0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–22–3, చహల్‌ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement