breaking news
Harpreet Brar
-
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్‌మైర్ (బి) తుషార్ 9; ప్రభ్‌సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్‌మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్‌ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్‌ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్‌ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్‌మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2. -
హర్‌ప్రీత్ సూపర్ క్యాచ్.. గుజరాత్ ఫ్యాన్ గార్ల్ షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. హర్‌ప్రీత్ అద్బుతమైన క్యాచ్‌తో గుజరాత్ ఆటగాడు విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 18 ఓవర్లో కగిసో రబాడ నాలుగో బంతిని విజయ్ శంకర్‌కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో శంకర్ లాంగాఫ్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగాఫ్‌లో ఉన్న హర్‌ప్రీత్ బ్రార్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న గుజరాత్ ఫ్యాన్ ఒక అమ్మాయి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/oG5TZzIGJ0 — Sitaraman (@Sitaraman112971) April 4, 2024 -
'ఆర్సీబీకి చుక్కలు చూపించాడు.. వరల్డ్‌కప్‌లో ఛాన్స్ ఇవ్వాల్సిందే'
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన హర్‌ప్రీత్.. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్ వంటి కీలక ఆటగాళ్లను బ్రార్ ఔట్ చేశాడు. తన బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి పంజాబ్ ఆఖరి వరకు పోటీ ఇచ్చిందంటే అందుకు ప్రధాన కారణం హర్‌ప్రీత్. ఈ క్రమంలో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుత ప్రదర్శన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను సైతం ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత సెలక్టర్లు బ్రార్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలని పీటర్సన్ అన్నాడు. "ఐపీఎల్ ఎంతో మంది దేశవాళీ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. చాలా సంతోషంగా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీ20 వరల్డ్‌కప్ కోసం సెలక్టర్లు అతడి పేరును పరిశీలించాలి. ఇక విరాట్ మరోసారి తన క్లాస్‌ను చూపించడంటూ" పీటర్సన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ అనూహ్యంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది