'ఆర్సీబీకి చుక్కలు చూపించాడు.. వరల్డ్‌కప్‌లో ఛాన్స్ ఇవ్వాల్సిందే' | Indian selectors must keep a close eye on Harpreet Brar for the T20 WC | Sakshi
Sakshi News home page

'ఆర్సీబీకి చుక్కలు చూపించాడు.. టీ20 వరల్డ్‌కప్‌లో ఛాన్స్ ఇవ్వాల్సిందే'

Mar 26 2024 6:09 PM | Updated on Mar 26 2024 6:57 PM

Indian selectors must keep a close eye on Harpreet Brar for the T20 WC - Sakshi

హర్‌‍ప్రీత్‌ బ్రార్‌ (PC: IPL)

ఐపీఎల్‌-2024లో పంజాబ్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన హర్‌ప్రీత్.. తాజాగా ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా  అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. 

రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి  కీలక ఆటగాళ్లను బ్రార్ ఔట్ చేశాడు. తన బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి పంజాబ్ ఆఖరి వరకు పోటీ ఇచ్చిందంటే అందుకు ప్రధాన కారణం హర్‌ప్రీత్‌.  ఈ క్రమంలో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుత ప్రదర్శన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్  కెవిన్ పీటర్సన్‌ను సైతం ఆక‌ట్టుకుంది.  టీ20 ప్రపంచకప్-2024 కోసం భారత సెలక్టర్లు బ్రార్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలని పీటర్సన్ అన్నాడు. 

"ఐపీఎల్‌ ఎంతో మంది దేశవాళీ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. చాలా సంతోషంగా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీ20 వరల్డ్‌కప్ కోసం సెలక్టర్లు అతడి పేరును పరిశీలించాలి. ఇక విరాట్ మరోసారి తన క్లాస్‌ను చూపించడంటూ" పీటర్సన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ అనూహ్యంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement