
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. ఆఖరి బంతి వరకు పోరాడింది. చివరి ఓవర్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. శుభమ్ దూబే వరుసగా బౌండరీలు బాది గెలుపునకు చేరువ చేశాడు.
కానీ ఆఖరి బంతికి నాన్‌స్ట్రైక్‌లో జోఫ్రా అర రనౌట్ కావడంతో రాజస్తాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఓ దశలో రాజస్తాన్‌ను ఈజీగా గెలిపించేలా కన్పించిన పరాగ్.. కీలక సమయంలో ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారైంది.
పరాగ్ తృటిలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 45 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో పరాగ్ వరుస ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన స్పిన్నర్ మోయిన్ అలీ బౌలింగ్‌లో తొలి బంతికి షిమ్రన్ హెట్‌మెయిర్ సింగిల్ తీసి పరాగ్‌కు స్టైక్ ఇచ్చాడు.
ఆ తర్వాతి ఐదు బంతులను రియాన్ సిక్సర్లగా మలిచాడు. ఆ తర్వాత 14 ఓవర్ తొలి బంతికి ఓ పరుగు తీసి మళ్లీ పరాగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. పరాగ్ ఆ బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో వరుసగా తను ఎదర్కొన్న ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా పరాగ్ రికార్డులకెక్కాడు.
చదవండి: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!
𝙍𝙖𝙢𝙥𝙖𝙣𝙩 𝙍𝙞𝙮𝙖𝙣 🔥
The #RR captain is in the mood tonight 😎
He keeps @rajasthanroyals in the game 🩷
Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @rajasthanroyals | @ParagRiyan pic.twitter.com/zwGdrP3yMB— IndianPremierLeague (@IPL) May 4, 2025