స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు! | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌ కోచ్‌పై ‘రేప్‌’ ఆరోపణలు!

Published Fri, Sep 6 2019 2:33 AM

section 376 case filed on swimming coach - Sakshi

పనాజీ: గురుపూజోత్సవం రోజున దేశంలోని ప్రముఖ ఆటగాళ్లెందరో తమకు ఓనమాలు నేర్పిన శిక్షకులను స్మరించుకుంటున్న వేళ... ఒక క్రీడా గురువు ఆ బాధ్యతకు మచ్చ తెచ్చే పని చేశాడు. తన వద్ద శిక్షణ పొందుతున్న ఒక 15 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించి ఛీ కొట్టించుకున్నాడు! గోవా రాజధాని పనాజీలో ఈ ఘటన జరిగింది. బెంగాల్‌కు చెందిన సురజిత్‌ గంగూలీ అనే స్విమ్మింగ్‌ కోచ్‌ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండున్నరేళ్లుగా అతను   పనాజీలో కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

బాధిత అమ్మాయి కూడా బెంగాల్‌కు చెందినదే. ఈ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో గంగూలీ నిర్వాకం తెలిసింది. సదరు అమ్మాయి ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి దానిని గోవా పోలీసులకు బదిలీ చేశారు. సురజిత్‌పై వేర్వేరు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో రేప్‌ (376) కూడా ఉంది. ప్రస్తుతానికి సురజిత్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లినట్లుగా తెలిసింది. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌  రిజిజు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement