60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్‌ ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ | Nita Ambani Coach Vinod Channa On Her Yoga At 60, shares interesting facts | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్‌ ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

May 5 2025 12:54 PM | Updated on May 5 2025 1:08 PM

Nita Ambani Coach Vinod Channa On Her Yoga At 60, shares interesting facts

వ్యాపారవేత్త,  దేశీయ అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్‌ ఫౌండేషన్‌   ఛైర్‌ పర్సన్‌ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా తన ఫిట్‌నెస్‌  రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. చాలా  అలవోకగా యోగాసనాలు వేస్తూ కనిపించారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసు కోవాలని  ఈ సందర్భంగా మహిళలకు సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై, శరీరంపై శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు  తీసుకోవాలని సూచించారు  కూడా.  తాజాగా  కోచ్‌ వినోద్‌ చన్నా నీతా అంబానీ వ్యాయామ పద్ధతులపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నీతా అంబానీ ఫిట్‌నెస్ కోచ్ వినోద్ చన్నా, తన అనుభవాన్ని  బాలీవుడ్ షాదీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు . 60 ఏళ్ళ వయసులో కూడా నీతా అంబానీ వ్యాయామానికి  అత్యంత ప్రాధాన్యతనిస్తారంటూ వినోద్ చన్నా ఆమె వ్యాయామ దినచర్య గురించి మాట్లాడారు. తన సలహాలను, సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తారని వెల్లడించారు. " నేను నిర్ణయించినట్టే ఆమె వ్యాయామం చేస్తారు.చాలా కష్టపడతారు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమి చెప్పినా,  అనుసరించి  లక్ష్యాన్ని చేరుకుంటారు" అని చెప్పారు. వినోద్ మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, స్ట్రెచింగ్ ,శ్వాస వ్యాయామాలు  చేసిన వీడియోను నీతా ఇటీవల షేర్  చేసిన సంగతి తెలిసిందే.

వినోద​ చన్నా వ్యాయామ సలహాలు
50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్న సమయంలో వారి వారి  విభిన్న జీవనశైలి, ప్రతిదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ పోషకాహారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, కాల్షియం స్థాయి గురించి తెలుసుకోవాలని  చెప్పారు. లేదంటే  పైకి బాగానే ఉన్నప్పటీ, ఎముకలు పెళుసుగా మారి తొందరగా గాయపడతారని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల నిర్మాణం తగ్గుతుంది కాబట్టి పోషకాహారం పరిపూర్ణంగా ఉండాలని, కదలిక లేకపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడం, శక్తి, స్థిరత్వం, మనస్సు,శరీరం మధ్య సమన్వయాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.

చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!

ఉదయమా? సాయంత్రమా? 
ఉదయం లేదా రాత్రి వ్యాయామం చేయాలా వద్దా  అని ప్రశ్నిస్తే.. రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చని చెప్పారు వినోద్ . శరీరానికి చురుకుదనం, కదలికలే ముఖ్యం అని  చెప్పారు. "ఆడ అయినా మగ అయినా వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ అనేది చేతులు, భుజాలు, పొట్ట, వీపు , కాళ్లు వంటి శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది.  ఎవరైతే చురుగ్గా ఉండరో, వారికి భవిష్యత్తులో  ప్రతీ విషయంలోనూ సమస్యలొస్తాయి.  చురుగ్గా ఉండని వారు ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకి  వెయిట్‌ ట్రైనింగ్‌లో ముందుగా  మొబిలిటీ  అనేది  చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ  చదవండి: దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

కాగా సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌ వినోద్ చన్నా నీతాతోపాటు, ఆమె కుమార్తె ఇషా ,  చిన్న కుమారుడు అనంత్ అంబానీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వ్యాపారవేత్త, అనన్య బిర్లా,  నటి శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్,ఆయుష్మాన్ ఖురానా ఇతర నటులు  కొంతమందికి   వినోద్‌ దగ్గర శిక్షణ పొందిన వారే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement