కోచ్ పదవి నుండి తప్పుకున్న డారెన్‌ లీమన్‌ | Darren Lehmann steps down as Australia coach | Sakshi
Sakshi News home page

కోచ్ పదవి నుండి తప్పుకున్న డారెన్‌ లీమన్‌

Mar 29 2018 7:47 PM | Updated on Mar 22 2024 11:07 AM

బాల్‌ ట్యాంపరింగ్‌ కుంభకోణం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తూనే ఉంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌ ఇప్పటికే నిషేధానికి గురయ్యారు. ఈ వివాదంతో కుంగిపోయిన ఆసీస్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. తాజాగా ఆస్ట్రేలియా కోచ్‌ డారెన్‌ లీమన్‌ కూడా జట్టుకు దూరం కాబోతున్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌ స్కాంతో ప్రమేయం లేకపోయినప్పటికీ.. తాను రాజీనామా చేస్తున్నట్టు లీమన్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు ముగిసిన తర్వాత తాను కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement