మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడి ఎంట్రీ.. ఆ తర్వాత.. | Man Enters Ladies-Only Coach In Delhi Metro, Video Goes Viral - Sakshi
Sakshi News home page

అమ్మాయితో మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడు.. ఏం జరిగిందంటే..

Published Sat, Aug 26 2023 3:02 PM | Last Updated on Sat, Aug 26 2023 3:24 PM

Man Enters Ladies Only Coach In Delhi Metro - Sakshi

ఢిల్లీ: వివాదాలతో, చిత్రవిచిత్రాలతో తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఘటన జరిగింది. అసభ్య డ్యాన్సులు, ఫైటింగ్‌లు, వైరల్‌ కావడానికి కొందరు చేసే పిచ్చి పనులతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం కఠిన నిబంధనలు విధించింది. మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 

తాజాగా ఓ యువకుడు మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. మహిళ విభాగంలోకి పురుషులకు అనుమతి ఉండదు.. అయినప్పటికీ నియమాలను ఉల్లంఘిస్తూ వెళ్లడంపై రైలులో ఓ యువతి ప్రశ్నించింది. యువకునికి తోడుగా వచ్చిన మరో మహిళ.. ఆ యువతిపై దురుసుగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ కొట్టేంత పని చేసింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ, యువకుడిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే.. తాను తోడుగా ఉన్న మహిళకు సహాయంగా మాత్రమే మహిళల విభాగంలోకి వెళ్లానని, అంతకు మించి వేరే ఉద్దేశం లేదని ఆ యువకుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

ఇదీ చదవండి: చంద్రయాన్‌ 3: 'విక్రమ్ ల్యాండర్ నేనే తయారు చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement