అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు | Nobody Will Hire Women Supreme Court Comments on Menstrual Leaves | Sakshi
Sakshi News home page

అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు

Mar 13 2026 12:16 PM | Updated on Mar 13 2026 1:20 PM

Nobody Will Hire Women Supreme Court Comments on Menstrual Leaves

ఢిల్లీ: మహిళల పీరియడ్‌ లీవ్‌కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. మహిళలకు రుతుస్రావం సమయంలో సెలవులు తప్పనిసరి చేస్తే ఏ కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి మెుగ్గు చూపవని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుస్రావం సమయంలో మహిళలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు శుక్రవారం విచారించింది.  

మహిళల సహజ రుతుస్రావం సమయంలో విద్యార్థినిలకు, ఉద్యోగస్థులకు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.  ఆ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.   

‘పీరియడ్‌ సమస్యపై, దాని సున్నితత్వంపై  అవగాహన కల్పించడం వేరు. రుతుక్రమం సమయంలో సెలవులు తప్పనిసరి  అనిచట్టం చేస్తే మహిళలకే నష్టకరంగా మారవచ్చు. వారిని ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోరు. గవర్నమెంట్ ఉద్యోగాలు, జ్యూడీషియరీ జాబ్స్ ఎందులోనూ వారికి చోటు ఉండదు. కంపెనీల మనస్థత్వం మీకు తెలియదు’ అని అన్నారు. 

అయితే దీనిపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఆడపిల్లలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని  ఆరోగ్యం, విద్య, గౌరవం వారికి ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత అని తెలిపింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వారికి ఉచితంగా నాప్‌కీన్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, మెంటల్ హెల్త్  అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement