రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌.. ఎంత బావుందో చూశారా!

Coach Restaurant Food Express Opened at Guntur Railway Station - Sakshi

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే తొలి వినూత్న ప్రయోగానికి గుంటూరు రైల్వేస్టేషన్‌ వేదికైంది. అధునాతన హంగులతో ఇక్కడ రైల్వే శాఖ ఫుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో కోచ్‌ రెస్టారెంట్‌ను ముస్తాబు చేసింది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పరిధిలో దీనిని రైల్వే డీఆర్‌ఎం మోహన్‌రాజా సోమవారం ప్రారంభించారు.


ఈ సందర్భంగా మోహన్‌రాజా మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ కోచ్‌ రెస్టారెంట్‌ ప్రయాణికులతోపాటు గుంటూరు ప్రజలకు మంచి అనుభూతినిస్తుందన్నారు. 24 గంటలూ రెస్టారెంట్‌ పనిచేస్తుందని, రుచికరమైన వేడివేడి వంటకాలు లభిస్తాయని చెప్పారు. ఈ రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌ను పాత అన్‌సర్వీస్‌బుల్‌ కోచ్‌ని ఉపయోగించడం ద్వారా రైలు ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి డివిజన్‌లో ఈ వినూత్న ఆలోచనను రూపొందించడం జరిగిదన్నారు.


ఈ కోచ్‌ను రెస్టారెంట్‌ అవసరాలకు రీడిజైన్‌ చేసి లైసెన్స్‌ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ వినూత్న కాన్సెప్ట్‌ ద్వారా రైలు ప్రయాణికులు అందమైన ఇంటీరియర్స్‌తో పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌ మోడిఫైడ్‌ రైల్‌ కోచ్‌లో ప్రీమియం డైనింగ్‌ అనుభావాన్ని పొందుతారన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ సీనియర్‌ డీసీఎం వి.ఆంజనేయులు, అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ టి.హెచ్‌.ప్రసాదరావు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: విద్యార్థులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top